Saif Alikhan Injured : బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం అందింది. ఆయన మోకాలు, భుజానికి గాయమైందని, శస్త్ర చికిత్స కోసం ముంబయిలోని ఓ హాస్పిటల్లో సోమవారం ఉదయం చేరారని బాలీవుడ్ మీడియాలో కథనాలు జోరుగా వస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లోనూ దీనికి సంబంధించిన పోస్ట్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' మూవీకీ సంబంధించి యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో సైఫ్‌కు గాయాలు తగిలినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై సైఫ్ అలీ ఖాన్ గానీ, మూవీటీమ్ కానీ ఇంకా స్పందించలేదు.
ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ :రెబల్ స్టార్ప్రభాస్ 'ఆదిపురుష్'తో తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు సైఫ్ అలీఖాన్. రావణుడి పాత్ర పోషించి ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆయన లుక్స్‌పై బాగా ట్రోల్స్ వచ్చాయి. ప్రస్తుతం 'దేవర' సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఆయన పోస్టర్ కూడా రిలీజై ఆకట్టుకుంది. బాలీవుడ్ భామ్ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రమిది.