Mokshagna Debut Heroine : నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమాపై రోజుకో బజ్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందా? అని నందమూరి అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మోక్షు డెబ్యూ మూవీలో హీరోయిన్ గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్గా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాశి థడాని. ఈ యంగ్ బ్యూటీ మోక్షుతో రొమాన్స్ చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. అయినప్పటికీ మోక్షజ్ఞకు జోడీగా రాశి కనిపించనున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞ పక్కన నటించే హీరోయిన్ కోసం మేకర్స్ వెతుకున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వార్తలు మరింత ఊపందుకోవడం గమనార్హం.
గ్రాఫిక్స్ మాయాజాలం
మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ కాంబోలో ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. హను- మాన్ లానే ఈ మూవీలోని భారీ గ్రాఫిక్స్ ఉంటుందని సమాచారం. అలాగే ఈ మూవీలో హీరో బాలకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.