ETV Bharat / state

అప్పులు తీసుకుని - అడిగితే బెదిరింపులు : ఆ మహిళా ఎస్పీ రూటే సెపరేటు - INTELLIGENCE WOMAN SP SUSPEND

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇంటిలెజెన్స్ మహిళా ఎస్పీ - విధుల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్‌

Woman SP Suspend  In Hyderabad
Intelligence Department Woman SP Suspend (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 11:53 AM IST

Intelligence Department Woman SP Suspend : ఎవరైనా అవినీతికి పాల్పడితే దండించే పోలీసులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇవ్వని వ్యాపారులను బెదిరిస్తున్నారు. అప్పుల పేరుతో డబ్బులు తీసుకొని, తిరిగి ఇవ్వమంటే వాళ్లకున్న అధికార బలంతో బెదిరిస్తున్నారు. ఇలా పోలీసులే వసూళ్లు చేస్తే రౌడీల నుంచి ప్రజలను ఎవరు రక్షిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటెలిజెన్స్‌లో పని చేస్తూ అక్రమ వసూళ్లు : తాజాగా ఇంటెలిజెన్స్‌లో పని చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ మహిళా ఎస్పీపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇంటెలిజెన్స్‌ విధుల నుంచి తప్పించి శుక్రవారం డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. రాష్ట్రంలోని కీలకమైన జిల్లాను పర్యవేక్షించే బాధ్యతల్లో ఉన్న ఆమె వ్యవహారం శ్రుతిమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

అప్పులు తిరిగివ్వాలని కోరితే : ఏడేళ్ల క్రితం ఆ జిల్లాలో డీఎస్పీగా చేరి ప్రస్తుతం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెపై ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. తన సిబ్బందితో పాటు కింది స్థాయి అధికారుల నుంచి అప్పు రూపకంగా, చేబదులు రూపంలో రూ.లక్షల్లో డబ్బులు తీసుకున్నారని, తిరిగి ఇవ్వమని కోరితే ఇంటెలిజెన్స్‌ నివేదికల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.

వంట సరకుల సరఫరాలో అధికార దుర్వినియోగం : అలాగే శ్రీశైలం ప్రాంతంలో తన బంధువుకు చెందిన ఓ హోటల్‌ నిర్మాణంలో వంట సరకుల సరఫరాలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆమెపై కొంతమంది ఫిర్యాదులు చేశారు. తన ఇంట్లో జరిగిన వేడుకలకు బహుమతులు తీసుకురావాలంటూ నేరుగా అడగడం వంటి చర్యలతో అధికారుల్లో చులకన భావం ఏర్పడేందుకు దారి తీసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రజల్లో పోలీసులకున్న గౌరవం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఇంటెలిజెన్స్‌ నుంచి తీసేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఒక ఎస్పీ స్థాయి అధికారిణిపై ఇలా అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు ఆశ్చర్యపడుతున్నారు.

'వారిని విధుల్లోకి తీసుకోండి.. లేదంటే మమ్మల్ని సస్పెండ్​ చేయండి' - ఆగని ఖాకీల ఆందోళనలు

తెలంగాణ పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం - 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.