Ajith Kumar About Movies : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలియజేశారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రేసింగ్‌పైనే ఉందని, ఆ పోటీలు ముగిసేంతవరకూ తాను సినిమాల్లో నటించనంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట ట్రెండ్ అవ్వగా, అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
" as a team owner untill the racing season is on, i wouldn't be signing any films✍️. probably between october & march i will be doing films🎬, so that no one is worried and i can fully focus on racing🏎️"
— AmuthaBharathi (@CinemaWithAB) January 10, 2025
- #Ajithkumar pic.twitter.com/6smTAw5Jj9
ఇక ప్రస్తుతం అజిత్ ప్రాక్టీస్ చేస్తున్న కార్ రేసు జనవరి 12న ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా ఈ ఈవెంట్ రెండు రోజుల పాటు జరగనుంది. దీంతో అజిత్ కొద్ది రోజుల క్రితమే అక్కడి చేరుకుని ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో తీవ్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే రీసెంట్గా ఆయన కారు ట్రాక్‌లోని బారికేడ్‌ను చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. కారు బాగా దెబ్బతిన్నప్పటికీ, అజిత్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త రేసింగ్ టీమ్!
అయితే అజిత్‌కు రేసింగ్ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగుల నుంచి బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి మిగతా సమయాన్ని బైక్స్, కార్లతో చక్కర్లు కొడుతుంటూ కనిపిస్తుంటారు. కొన్ని నెలల క్రితం గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ఆయన కారును డ్రైవ్ చేశారు. ఆ వీడియో అప్పట్లోనే తెగ వైరల్ అయింది. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కూడా అజిత్ ఓ స్టార్టప్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ బైక్‌పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇదే కాకుండా తాజాగా తన రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. 'అజిత్ కుమార్ రేసింగ్' అనే పేరుతో టీమ్‌ను ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర తాజాగా వెల్లడించారు.
ఇక అజిత్ అప్‌కమింగ్ మూవీస్ విషయానికి వస్తే, ఆయన 62వ చిత్రంగా రూపొందిన 'విడా ముయార్చి' ఈ సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. మగిల్ తిరుమేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇది కాకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాష చిత్రంలోనూ నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్స్‌లో అజిత్ న్యూ లుక్‌లో కనిపించి అభిమానులను అలరించారు.
Wishing the best, dear #AjithKumar Sir, for the 24H Series in Dubai! Your unwavering passion and dedication continue to inspire us all. May you achieve immense success in this as well, Sir ❤️❤️🤗 pic.twitter.com/AU4pKBwRHa
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 11, 2025
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న అజిత్ మూవీ - నిరాశలో ఫ్యాన్స్!
'దయచేసి నన్ను అలా పిలవొద్దు- చాలా ఇబ్బందిగా ఉంది'- ఫ్యాన్స్‌కు అజిత్ ఓపెన్ లెటర్