తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

క్రేజీ ప్రాజెక్ట్స్​ - 'RRR' నిర్మాతకు కాసుల వర్షమే

RRR producer DVV Danayya Vijay Thalapathy : ఆర్​ఆర్​ఆర్ నిర్మాత డీవివి దానయ్య క్రేజీ ప్రాజెక్ట్​ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు వర్కౌట్ అయితే కాసుల వర్షమే!

క్రేజీ ప్రాజెక్ట్స్​ - 'RRR' నిర్మాతకు కాసుల వర్షమే
క్రేజీ ప్రాజెక్ట్స్​ - 'RRR' నిర్మాతకు కాసుల వర్షమే

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 2:31 PM IST

Updated : Feb 3, 2024, 3:47 PM IST

RRR producer DVV Danayya Vijay Thalapathy:రాజమౌళి దర్వకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR). ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డును అందుకోవడంతో పాటు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎప్పుడూ సౌమ్యంగా, ఎక్కువ కనిపించకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు దానయ్య. అయితే ఇప్పుడీ అగ్ర నిర్మాతపై కనక వర్షం కురిసేలా ఉంది. ఇప్పటికే ఆయన పవర్ స్టార్​ పవన్ కల్యాణ్​తో 'ఓజీ (Original Gangster)', నేచురల్ స్టార్ నానితో 'సరిపోదా శనివారం' సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ఉన్న క్రేజ్​తో థియేట్రికల్ ప్లస్ డిజిటల్ రైట్స్​కు భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే డీల్స్ ముగించేస్తున్నారు. ఎంత లేదన్నా ఈ రెండు సినిమాలపై ఆయనకు కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది.

ఇకపోతే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ పార్టీని అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా మరో సినిమా మాత్రమే ఆయన చేయనున్నట్లు తెలుస్తోంది. అది దానయ్య (DVV Entertainment)తోనేనని జోరుగా ప్రచారం సాగుతోంది. డీవివి బ్యానర్​ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రాలేదు కానీ, ప్రాజెక్టు కన్ఫార్మ్ అని చెన్నై వర్గాల్లో టాక్​ వినిపిస్తోంది. ఈ ఏడాది చివరిలోపే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ లేదా హెచ్ వినోద్​ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే విజయ్​ పొలిటికల్ ఎంట్రీ ముందు ఇదే చివరి సినిమా అయ్యే ఛాన్స్​ ఉంది. దీంతో తమిళ ఆడియెన్స్ తప్పకుండా భారీ సంఖ్యలో దీన్ని చూస్తారు. అసలే విజయ్ సినిమా అంటేనే రికార్డులు గ్యారంటీ. ఇక బాగుంటే మాత్రం వెరే లెవల్​లో ఉంటది. దానయ్యకు కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Last Updated : Feb 3, 2024, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details