Ram Potineni Favourites :ఎనర్జిటిక్ స్టార్ అంటే ప్రతిఒక్కరికీ ఠక్కున గుర్తొచే పేరు రామ్ పోతినేని. ఈ స్టార్ హీరో తన యాక్టింగ్, డ్యాన్స్‌ను ఎంత ఉత్సాహంగా చేస్తారో, అంతే ఉల్లాసంగా అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఆయన సినిమ లైఫ్ గురించి అందికీ తెలిసిందే. కానీ ఆయన పర్సనల్ లైఫ్, ఇష్టమైన వాటి గురించి అతికొద్దిమందికే తెలుసు. మరీ ఆయన ఇష్టాఇష్టాల గురించి తాజాగా ఓ ఇంటర్య్యూలో తెలిపారు. ఆ విశేషాలు రామ్ మాటల్లోనే
- 11 ఏళ్ల వయసులో 'అడయాళం' అనే తమిళ్ షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశాను. అదే కెమెరా ముందు నేను నిల్చున్న ఫస్ట్ మూమెంట్.
- కాఫీతోనే నా రోజు మొదలవుతుంది. రోజుకు ఎన్ని కప్పులు తాగుతానో అసలు లెక్కలేదు. బిర్యానీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక వంట చేయడం నాకు చాలా ఇష్టమైన పని.
- సినిమాల్లోకి రాకముందు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అందులో 'నుంచుకు' అనే ఓ ప్రత్యేక యుద్ధ విద్యలో స్పెషలైజేషన్ చేశాను. చాలా సినిమాల్లో దాన్ని పెర్ఫామ్ చేసే అవకాశం కూడా వచ్చింది.
- విరాట్ కోహ్లీకీ అలాగే నాకూ, దగ్గర పోలికలు ఉంటాయని చాలామంది అన్నారు. ఒకవేళ కోహ్లీ బయోపిక్‌లో అవకాశం వస్తే నేను తప్పకుండా యాక్ట్ చేస్తాను.
- నాకు స్మోకింగ్ అలవాటు లేదు. 'జగడం' సినిమా కోసం చైన్ స్మోకర్‌గా మారాను. కానీ షూటింగ్ అయ్యాక ఆ అలవాటు మానడానికి నాకు చాలా ఇబ్బందైంది.
- సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా, అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం.
- 'వారియర్' కోసం వర్కవుట్స్ చేస్తున్న సమయంలో వెన్నుపూసకు గాయమైంది. దాంతో నాలుగు నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.
- షూటింగ్ లేనప్పుడు, లేకుంటే టైమ్ దొరికినప్పుడు విదేశాలకు వెళుతుంటాను. అక్కడ హాస్టల్స్‌లో ఉంటూ నచ్చినవి వండుకుని తింటుంటాను. చుట్టుపక్కలున్న ప్రదేశాలను చూసి వస్తుంటాను.
- బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నా ఫేవరెట్ స్టార్. తనతో కలిసి ఒక్కసారైనా నటించాలని ఉంది.
- 'రెడీ' సినిమాలో నటించినప్పటి నుంచీ జెనీలియా, నేనూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. డైరెక్టర్ అట్లీ అలాగే ఆయన సతీమణి కృష్ణప్రియ కూడా నాకు ప్రాణస్నేహితులు.
- మార్కెట్‌లోకి ఏదైనా కొత్తగా వస్తే ఆ గ్యాడ్జెట్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటుంటాను. కొత్త మోడల్ ఫోన్లు ఎక్కువగా కొని వాడటం నాకు అలవాటు.
- లగ్జరీ కార్లు కొనడం వాటిని నడపడం నాకు అలవాటు. అన్నింటి కన్నా లాంబోర్గిని అంటే ఇంకా ఇష్టం. మా గ్యారేజీలో ఉన్న ఆ కారుకు ముద్దుగా 'ద బుల్' అని పేరు పేరు పెట్టుకున్నాను.
- మనసుకు హాయినిచ్చే తెలుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మా ఇంట్లోని ప్రతిదీ ఆ రంగులోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటాను. షూటింగ్ అయ్యాక ఇంటికొచ్చి ఆ తెల్లని సోఫాలో కూర్చుని కాసేపు ఇల్లంతా చూస్తే నా స్ట్రెస్ అంతా పోతుంది.