Tollywood Upcoming Sister Sentiment Movies : చిన్నప్పుడు కలిసి సరదాగా ఆటలు ఆడటం, కాస్త పెద్దయ్యాక కొట్టుకోవడం, అలగడం, పోట్లాడుకోవడం, ఇంకాస్త పెద్దయ్యాక ఇంటి కోసం బాధ్యతలు పంచుకోవడం - ఇలా జీవితంలో ముందుకు వెళ్లే క్రమంలో పలు దశలు మారినా మారనిదే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధం. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసి వారిద్దరి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది రాఖీ పండగ. జీవితాంతం సోదరుడు తనకు అండగా ఉంటాడనే నమ్మకాన్ని రాఖీ కట్టిన సోదరికి ఇస్తుంది. అయితే వెండితెరపైనా ఈ బంధానికి(Raksha Bandhan 2024) ప్రత్యేక స్థానం ఉంది.
ఎందుకంటే ఇండియన్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలకు బలమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ కథలైతే మరింత ప్రత్యేకం. అన్నాచెల్లెళ్ల భావోద్వేగాలు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలతో అల్లుకున్న కథలు దాదాపుగా వెండితెరపై సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ఇప్పుడు కూడా పలు స్టార్ హీరోల సినిమాలు సిస్టర్ సెంటిమెంట్‌తోనే రానున్నాయి.
అవేంటంటే? - ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలోనూ అన్నాచెల్లి సెంటిమెంట్‌కు(Viswambara Sister Sentiment Movie) బలమైన ప్రాధాన్యత ఇచ్చిన్నట్లు సమాచారం. బింబిసార ఫేమ్ వశిష్ఠ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ దీన్ని నిర్మిస్తోంది. ఇందులో ఐదుగురు సోదరీమణుల ముద్దుల అన్నగా చిరంజీవి కనిపించనున్నట్లు ప్రచారం. ఈ చెల్లెళ్ల పాత్రల్లో ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితరులు నటిస్తున్నారట. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుంది.
త్వరలోనే సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు హీరో నాని. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలు. ఇది యాక్షన్ చిత్రంలా కనిపిస్తున్నప్పటికీ సినిమాలో అన్నాచెల్లి అనుబంధాలకు(Saripoda Sanivaram Sister Sentiment Movie) ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. నానికి చెల్లిగా 'అరువి' ఫేమ్ అదితి బాలన్ నటించింది. వీళ్లిద్దరి బ్రదర్ అండ్ సిస్టర్ ట్రాక్ సినిమాకు కీలకంగా ఉండనుందట. ఇదే కథను మలుపు తిప్పుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 29న విడుదల కానుంది.