Ravi Teja Mass Jathara : మాస్ మహారాజ్ రవితేజ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'మాస్ జాతర'. ఈ సినిమాకు బోగవరపు భాను దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా నుంచి వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. టైటిల్‌కు తగ్గట్లే ఫుల్ మాస్‌గా ఉన్న ఈ గ్లింప్స్ మీరు చూశారా?
గ్లింప్స్ మెలోడీ మ్యూజిక్‌తో ప్రారంభం అయ్యింది. ఇందులోనూ రవితేజ తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. విలన్లను చితక్కొడుతున్న రెండు, మూడు సీన్లు చూపించారు. టీజర్ మొత్తంలో రవితేజ హుషారుగా కనిపించారు. వాస్తవానికి మాస్ మహారాజ సినిమా అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఆ ఎనర్జీనే. దీనికి భీమ్స్ అందించిన బీజీఎమ్ అదిరిపొయింది. ఇక రైల్వే స్టేషన్లో ఓ అమ్మాయితో 'మనదే ఇందతా' అనే డైలాగ్ చెబుతారు.
ఆ అమ్మాయి శ్రీలీలలాగే అనిపిస్తుంది. ఓవరాల్‌గా నిమిషం నిడివి ఉన్న టీజర్లో యాక్షన్, రొమాంటిక్, కామెడీ యాంగిల్స్ చూపించారు. మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ గ్లింప్స్ ఫుల్ మీల్స్లాగే ఉంది. అటు అభిమానులు కూడా సినిమా 'ర్యాంప్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ గ్లింప్స్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా, రవితేజకు ఇది 75వ సినిమా కావడం విశేషం.
హిట్ కాంబో
ఇక ఇప్పటికే ఈ శ్రీలీల కలిసి నటించిన 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. ధమాకాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరూ మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ జోడి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.
కాగా, ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తుంన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా రూపొందిస్తున్నారు. 2025 వేసవి సందర్భంగా మే 09న రిలీజ్ కానుంది.
'దీపావళికి మోత మోగిపోద్ది మనదే ఇదంతా' - రవితేజ RT75 టైటిల్ పోస్టర్ రిలీజ్