Pushpa 2 Runtime Record : ఒకప్పటిలాగా ఇప్పటి కాలంలో ఎక్కువ నిడివి గల సినిమాలు రావడం చాలా అరుదు. సాధారణంగా ఏదైనా మూవీ 2 నుంచి మూడు గంటల మధ్యలో ఉండటం చూశాం. అయితే కొన్నింటిని మాత్రం ఎంతగా ఎడిట్ చేసినా, స్టోరీ డిమాండ్ మేరకు వాటి రన్‌టైమ్ ఎక్కువైనా అలానే విడుదల చేయాల్సి వస్తుంది.
ఇక తెలుగులో అత్యధిక నిడివి కలిగిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ 'దానవీరశూరకర్ణ' ఉంది. నందమూరి తారక రామారావు స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్లింది. 1977లో విడుదలైన ఈ సినిమా దాదాపు 3 గంటల 33 నిమిషాల నిడివితో వచ్చింది. ఆ తర్వాత 1963లో విడుదలైన 'లవకుశ' రన్‌టైమ్ 3: 28 గంటలు. ఇది కూడా సీనియర్ ఎన్టీఆర్‌దే కావడం విశేషం.
అయితే ఇప్పుడు 'పుష్ప 2 ది రూల్' ఈ తర్వాతి స్థానంలోకి రానుందట. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను 3 గంటల 21 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ సినిమా అత్యధిక నిడివిగల చిత్రాల లిస్ట్‌లో చేరనుంది. కానీ ఇప్పటి ఆడియెన్స్ అంతసేపు ఈ సినిమాను ఓపిగ్గా చూస్తారో లేదో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
ఇక టాలీవుడ్లో ఇప్పటివరకూ వచ్చిన లాంగ్ రన్‌టైమ్ సినిమాలు ఏవంటే :
సినిమా
రన్‌టైమ్
పాతాళ భైరవి
3: 15 గంటలు
పాండవ వనవాసం
3: 18 గంటలు
అల్లూరి సీతారామరాజు
3 :07 నిమిషాలు
మాయాబజార్
3: 04 గంటలు
ఆర్‌ఆర్‌ఆర్
3: 02 గంటలు
అర్జున్ రెడ్డి
3.02 గంటలు
మిస్సమ్మ
3.01 గంటలు
ప్రస్థానం
3.01 గంటలు
నువ్వు నాకు నచ్చావ్
3 గంటలు
ఆదిపురుష్
2:59 గంటలు
పుష్ప 1
2 :59 గంటలు
గద్దలకొండ గణేష్
2: 52 గంటలు
రంగస్థలం
2: 54 గంటలు
ఇక 'పుష్ప 2' సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో శ్రీ వల్లి అనే పాత్రలో మెరుస్తుండగా, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ భన్వర్‌లాల్ షెకావత్‌గా అలాగే సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్‌లు స్ట్రాంగ్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలు చాట్బస్టర్లుగా నిలిచి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా ప్రోడ్యూస్ చేశారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.