Prashanth Neel Apology To Shah Rukh Khan :'కేజీఎఫ్', 'సలార్' సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ బాలీవుడ్ స్టారీ హీరో షారుక్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పారు. సలార్‌ను కూడా డంకీ రిలీజ్ అయిన సమయంలోనే రిలీజ్ చేయాల్సి వచ్చిందని, కానీ అలా చేసి ఉండేది కాదన్నారు. షారుక్‌తో పాటు 'డంకీ' మూవీ టీమ్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"షారుక్ టీమ్ ముందుగా రిలీజ్ తేదీని ప్రకటించింది. క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని వారు సంవత్సరం ముందే ప్రకటించారు. కానీ 'సలార్'ను మేము అదే సమయంలో విడుదల చేశాం. ఈ విషయంలో షారుక్‌కు, 'డంకీ' టీమ్‌కు నేను క్షమాపణలు చెబుతున్నా. రెండు పెద్ద సినిమాలు ఒకేసమయంలో రిలీజ్ కాకూడదు. కానీ, మాకు ఆ తేదీనే బాగుందని జ్యోతిష్యులు చెప్పారు. అలాగే మరికొన్ని కారణాల వల్ల మేము ఆ సమయంలోనే రావాలని నిర్ణయానికి వచ్చాం. షారుక్, రాజ్‌కుమార్‌లు మంచి మనసున్న వ్యక్తులు. మమ్మల్ని అర్థం చేసుకున్నారు' అని ఆ వీడియోలో ప్రశాంత్ నీల్ వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
వీడియో వైరల్
'సలార్', 'డంకీ' సినిమాలు గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒక్కరోజు తేడాతో రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ 21న 'డంకీ' ప్రేక్షకుల ముందుకు రాగా, డిసెంబర్ 22న 'సలార్' విడుదలైంది. దీని గురించి ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సలార్, డంకీ రెండు చిత్రాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, తొలిరోజే ఇవి మంచి కలెక్షన్లు వసూళ్లు చేశాయి.