తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రశాంత్ వర్మ సూపర్ ప్లాన్ - ఆ స్టార్ తండ్రీ కొడుకులతో మల్టీస్టారర్!​ - Prasanth Varma Multi Starrer Movie - PRASANTH VARMA MULTI STARRER MOVIE

Prasanth Varma Multi Starrer Movie : 'హను-మాన్' తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే తాజాగా ఈయన ఓ సూపర్ కాంబోతో మల్టీ స్టారర్​ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆ విశేషాలు మీ కోసం.

Prasanth Varma Multi Starrer Movie
Prasanth Varma (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 12:57 PM IST

Prasanth Varma Multi Starrer Movie :స్టార్ డైరెక్టర్ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో ఇటీవలె రూపొందిన 'హను-మాన్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకుగా విడుదలైన ఈ చిత్రం వరల్డ్​వైడ్​గా గుర్తింపు పొంది కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లింది. దీంతో అందరి దృష్టి ఈ యంగ్ డైరెక్టర్ అప్​కమింగ్ ప్రాజెక్టులపై పడింది.

అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ వర్మ కూడా పలు ప్రాజెక్టులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'హనుమాన్ 2' షూటింగ్ ప్రారంభించగా, ఈ చిత్రంతో పాటు అనుపమతో మరో ప్రాజెక్టును తెరకెక్కించే పనుల్లో ఉన్నారు.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈయన ఇప్పట్లో మరో ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేయరని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ప్రశాంత్​ వర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఆయన మరిన్ని సినిమాలకు డైరెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ, ఆయన తనయడు మోక్షజ్ఞలతో ఓ మల్టీ స్టారర్​ను ప్లాన్ చేస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. గత కొంతకాలంగా మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు కూడా ఈ రూమర్​కు బలం చేకురుస్తోంది. యాక్టింగ్ కోసం మోక్షజ్ఞ ఇప్పటికే విదేశాల్లో శిక్షణ తీసుకుని వచ్చారు. మరికొన్ని మెలకువలు నేర్చుకుంటున్నారని సమాచారం. తాజాగా ఆయన లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో రివీల్ చేశారు.

ఇదిలా ఉండగా, గతంలో బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ తన ఐకానిక్ మూవీ అయిన 'ఆదిత్య 369'తోనే చేస్తారని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ సినిమా బాధ్యతలు ప్రశాంత వర్మకు ఇచ్చారేమో అంటూ మాట్లాడుకుంటున్నారు.

ప్రశాంత్ రణ్​వీర్ సినిమా - క్లారిటీ ఇచ్చిన టీమ్​
బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్​, ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా రానున్నట్లు గతంలో జోరుగా ప్రచారం సాగింది. హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలతో లాంఛ్ కూడా అయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు సడెన్​గా ఈ చిత్రం ఆగిపోయిందంటూ రూమర్స్​ మొదలయ్యాయి. దీంతో ఈ విషయంపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

"క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రశాంత్ శర్మ, రణ్‌వీర్ సింగ్ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. హనుమాన్ జయంతి రోజే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్​ను హైదరాబాద్​లో మొదలుపెట్టారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ప్రశాంత్ ఈ సినిమా షూటింగ్​ చేశారు. రణ్‌వీర్​పై ఇప్పటికే కొన్ని సీన్లు కూడా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్​ ఇవ్వనున్నారు." అంటూ ప్రశాంత్ టీమ్​కు చెందిన మెంబర్ వెల్లడించారు.

ప్రశాంత్ వర్మ సూపర్ అప్డేట్​​ - డ్రాగన్​తో జై హనుమాన్​ పోరాటం! - Prasanth Varma Jai hanuman

ప్రశాంత్ వర్మ షాకింగ్ డెసిషన్- ఆ స్టార్ కోసం 'జై హనుమాన్' పోస్ట్​పోన్! - Prashanth Varma

ABOUT THE AUTHOR

...view details