ETV Bharat / entertainment

'తండేల్' తగ్గేదేలే - రెండో రోజు అక్కడ కూడా మంచి జోరుగా! - THANDEL MOVIE BOX OFFICE COLLECTION

'తండేల్'​ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Thandel Movie Box Office Collection
Naga Chaitanya Thandel Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2025, 1:06 PM IST

Thandel Movie Box Office Collection : టావీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్​లో తెరకెక్కిన లేెటెస్ట్ మూవీ 'తండేల్'. మత్స్యకారుల బ్యాక్​డ్రాప్​లో ఓ ఫీల్​ గుడ్ మూవీగా ఇది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్​ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.41 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తాజాగా మేకర్స్ అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. అంతేకాకుండా యూఎస్ బాబాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సుమారు 550K డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డుకెక్కింది. త్వరలోనే $1 మిలియన్ మైల్​స్టోన్​ను చేరుకునే అవకాశం ఉందని క్రిటిక్స్ అంటున్నారు.

అక్కడ కూడా రికార్డే :
ఇదిలా ఉండగా, ప్రముఖ ఆన్​లైన్ టికెట్ బుకింగ్ యాప్​ 'బుక్‌మై షో'లోనూ 'తండేల్​' రికార్డు సృష్టించింది. 24 గంటల్లో దాదాపు 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని, అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు ఆ సంస్థ తాజాగా తెలిపింది.

స్టోరీ ఏంటంటే :
స‌ముద్రంలోకి చేప‌ల వేట‌కి వెళ్లిన తోటి మ‌త్స్యకారులంద‌రినీ ముందుకు న‌డిపించే నాయ‌కుడి పేరే 'తండేల్‌'. త‌న తండ్రి తండేల్ కావ‌డం వల్ల చిన్నప్పటి నుంచే ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి ఓ నాయ‌కుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు (నాగ‌చైత‌న్య‌). అలా పెద్ద‌య్యాక రాజు కూడా అంద‌రి క‌ష్టాల్ని వింటూ వాళ్ల‌కోసం నిల‌బ‌డ‌టం వల్ల అంద‌రూ అతడ్నే 'తండేల్‌'గా ఎంచుకుంటారు. ఇక రాజుకి తన చిన్నప్పటి ఫ్రెండ్ స‌త్య (సాయిప‌ల్ల‌వి) అంటే ప్రాణం. బుజ్జిత‌ల్లి అంటూ తనను ప్రేమ‌గా పిలుస్తుంటాడు.

ఇక రాజు అంటే స‌త్యకి కూడా చెప్ప‌లేనంత ప్రేమ‌. ఏడాదిలో తొమ్మిది నెల‌ల పాటు స‌ముద్రంలో గ‌డిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా? అంటూ ఎదురు చూస్తూ గ‌డుపుతుంటుంది. అయితే ఈ సారి వేట‌కి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటారు. అలా సముద్రంలోకి వెళ్లాక తుపాను క‌ల్లోలం సృష్టిస్తుంది. దీంతో పాకిస్థాన్‌ జ‌లాల్లోకి వెళ్లిన రాజు ప‌డ‌వని, అందులోని మ‌త్స్యకారులను అక్క‌డి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు స‌త్య రాజు కోసం ఏం చేసింది? శ్రీకాకుళం జిల్లాలోని మ‌త్స్య‌లేశం నుంచి పాకిస్థాన్‌ స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ వెళ్లి రాజుని, ఇత‌ర మ‌త్స్య‌కారులను ఆమె విడిపించిందా? రాజు, స‌త్యలు క‌లుసుకున్నారా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

'తండేల్‌'పై రాఘవేంద్రరావు రివ్యూ- చాలా రోజులకు ఇలాంటి సినిమా చూశారంట!

'తండేల్'​కు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసా మరి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.