ETV Bharat / entertainment

'తండేల్‌'పై రాఘవేంద్రరావు రివ్యూ- చాలా రోజులకు ఇలాంటి సినిమా చూశారంట! - THANDEL

'తండేల్‌'పై రాఘవేంద్రరావు రివ్యూ- నాగచైతన్య రెస్పాన్స్ ఏంటంటే?

Raghavendra Rao Thandel
Raghavendra Rao Thandel (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2025, 11:11 AM IST

Raghavendra Rao Review On Thandel : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య- సాయిపల్లవి కాంబినేషన్​లో తెరకెక్కిన 'తండేల్‌' మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్​ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు 'తండేల్'పై ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

'చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూశాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్​పై దర్శకుడు పెట్టిన శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయం అందుకున్న గీత ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా!' అని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

దీనికి హీరో నాగచైతన్య రెస్పాండ్ అయ్యారు. సీనియర్ దర్శకుడు నుంచి ప్రశంసలు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. 'థాంక్యూ సో మచ్‌ సర్‌. మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం' అని రిప్లై ఇచ్చారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న రిలీజైన ఈ సినిమా విజయం అందుకుంది. తండేల్‌ రాజుగా నాగచైతన్య, సత్యగా సాయిపల్లవి నటనతో ప్రేక్షకులను మెప్పించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో చైతన్యతన యాక్టింగ్‌తో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశారు.

స్టోరీ ఎంటంటే?
శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా దీనిని సిద్ధం చేశారు. ఓసారి సముద్రంలోకి వేటకు వెళ్లాక తుపాను క‌ల్లోలం సృష్టిస్తుంది. దీంతో పాకిస్థాన్‌ జ‌లాల్లోకి వెళ్లిన రాజు ప‌డ‌వని, అందులోని మ‌త్స్యకారులను అక్క‌డి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు.

ప్పుడు స‌త్య రాజు కోసం ఏం చేసింది? శ్రీకాకుళం జిల్లాలోని మ‌త్స్య‌లేశం నుంచి పాకిస్థాన్‌ స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ వెళ్లి రాజుని, ఇత‌ర మ‌త్స్య‌కారులను ఆమె విడిపించిందా? రాజు, స‌త్యలు క‌లుసుకున్నారా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ఓవర్సీస్​లో 'తండేల్' జోరు - తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?

'తండేల్' ట్విట్టర్ రివ్యూ - నాగచైతన్య లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.