తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రశాంత్ వర్మ సూపర్ అప్డేట్​​ - డ్రాగన్​తో జై హనుమాన్​ పోరాటం! - Prasanth Varma Jai hanuman - PRASANTH VARMA JAI HANUMAN

Prasanth Varma Jai hanuman Imax 3D : హనుమాన్‌ జన్మోత్సవం సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సరికొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. పూర్తి వివరాలు స్టోరీలో.

.
,

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 4:10 PM IST

Updated : Apr 23, 2024, 5:13 PM IST

Prasanth Varma Jai hanuman Imax 3D :హనుమాన్​ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ మరో అడ్వంచేరియస్ ప్రాజెక్టును తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్​కు సీక్వెల్​గా "జై హనుమాన్"ను రెడీ చేస్తున్నారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆసక్తికర విషయాన్ని తెలిపారాయన. భారీ వీఎఫ్ఎక్స్‌తో ముస్తాబవుతున్న జై హనుమాన్‌ మూవీని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చే ప్రతీ చిత్రాన్ని ఐమ్యాక్స్‌ 3డీ వెర్షన్‌లోనే తీసుకురానున్నట్లు తెలిపారు. జై హనుమాన్ స్పెషల్​ పోస్టర్​ను కూడా విడుదల చేశారాయన. ఓ పర్వతం అంచున గదతో నిలబడి ఉన్న మహావీరుడు హనుమాన్, ఆయనకు ఎదురుగా నిప్పులు కక్కుతూ సమీపిస్తున్న డ్రాగన్ ఇందులో కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకూ చైనా సినిమాలకే పరిమితమైన డ్రాగన్‌ కాన్సెప్ట్​ను ఇప్పుడు ఇండియన్​ సినిమాలోనూ చూపించనున్నారని తెలుస్తోంది.

"హనుమాన్ జయంతి రోజు సందర్భంగా విపత్తులను ఎదుర్కొని, మహత్తర విజయాన్ని అందుకునేందుకు సంకల్పిద్దాం. జై హనుమాన్ మూవీలో ఆంజనేయుడి యుద్దాన్ని నేరుగా 3డీలో వీక్షించండి" అంటూ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.

అయితే జై హనుమాన్ తారాగణం, నిర్మాత, సంగీత దర్శకుడు ఎవరు సహా తదితర వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికే సీక్వెల్‌లో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రశాంత్‌వర్మ వేగవంతం చేశారని తెలిసింది. పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం తెరకెక్కబోతుండం వల్ల బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటుల పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హను-మాన్‌ చిత్రాన్ని బడ్జెట్‌ పరిమితుల మధ్య తీసినా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడలేదు. దీంతో ఇంత తక్కువ బడ్జెట్​లో అద్భుతమైన అవుట్‌పుట్‌ రావడంతో సీక్వెల్​ కోసం బడ్జెట్​ మరింత పెంచనున్నారు. తొలి భాగాన్ని మించి ఉండేలా సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రశాంత్.

ఇకపోతే ఈ సంక్రాంతికి థియేటర్లలో సూపర్ సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతుంది. లో బడ్జెట్ మూవీగా మార్కెట్లోకి వచ్చి భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కూడా​ ఎక్కువ ధరకే అమ్ముడుపోయింది. థియేటర్లలోలాగానే ఓటీటీలోనూ అంతే సక్సెస్ రేటుతో స్ట్రీమింగ్​ అవుతోంది.

బాలయ్యను ఢీ కొట్టేందుకు సెట్​లోకి అడుగుపెట్టేసిన హంటర్​ - NBK 109 Villain

ప్రభాస్ లేటెస్ట్​ లుక్​ - లాంగ్ హెయిర్, గడ్డంతో కటౌట్ అదిరింది బాస్​! - Kalki 2898 AD

Last Updated : Apr 23, 2024, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details