Prabhas Rajasaab Audio Rights Big Deal : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ కెరీర్లో హైస్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ సక్సెస్‌లతో జెట్ స్పీడ్‌లో ముందుకెళ్తోన్న ఆయన ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
అలా ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో 'ది రాజా సాబ్' కూడా ఒకటి. త్వరలోనే ఇది విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. అయితే రీసెంట్గా ఈ మూవీ ఆడియో రైట్స్‌కు సంబంధించి పలు వార్తలు జోరుగా చక్కర్లు కొట్టాయి.
రాజా సాబ్ ఆడియో హక్కులు ఇంతకి అమ్ముడుపోయాయి, అంతకు అమ్ముడుపోయాయి అంటూ ప్రచారం సాగింది. రూ.15 కోట్లకు అమ్ముడుపోయినట్లు కథనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా దీనిపై ఓ స్పష్టత వచ్చింది. ది రాజా సాబ్ ఆడియో రైట్స్ రూ.15 కోట్ల ధర పలికినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసింది. నిర్మాత ఎస్కేఎన్ ఈ విషయంపై స్పందించారట. ఇందులో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారట.
Rajasaab Movie Heroines : కాగా, ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలోని పాటలు కమర్షియల్ ఆల్బమ్ అని, ఇందులో డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న పాటలున్నాయని ఆ మధ్య తమన్ చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. హారర్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
Prabhas Upcoming Movies :ఇకపోతే డార్లింగ్ప్రభాస్ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి.సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, హను రాఘవపూడి ఫౌజి, ప్రశాంత్ నీల్ సలార్ 2, నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ చిత్రాలు రానున్నాయి. ఈ చిత్రాలు ఇంకా షూటింగ్ ప్రారంభించుకోలేదు.
మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా - మొదటి అడుగు పడింది అక్కడే! - Mokshagna Prasanth Varma
PVCUలోకి బాలయ్య వారసుడు- కిర్రాక్‌గా మోక్షు ఫస్ట్ లుక్ - Mokshagna Teja Debut Movie