Kalki 2898 AD Bujji and Bhairava : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో భైరవగా కనిపించనున్నారు. అలానే ఈ మూవీ బుజ్జి అనే వాహనం కీలకంగా మారనుంది. అయితే ఈ అధునాతన భారీ కారును ఓ స్పెషల్ ఈవెంట్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. ఈ కారును ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మహీంద్రా, జయం మోటార్స్ సంస్థలు కలిసి తయారు చేశాయి. దాదాపు ఆరు టన్నుల బరువురు ఉన్న ఈ కారు తయారీ కోసం రూ. 7 కోట్ల వరకు ఖర్చయ్యిందట.
ఈ క్రమంలోనే కల్కి టీమ్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. బుజ్జి అండ్ భైరవ పేరుతో రూపొందించిన ప్రత్యేక వీడియో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయనుంది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది. బుజ్జితో భైరవ ప్రయాణం ఎలా సాగిందో ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. చిన్నారులకు వినోదం పంచే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు తాజాగా విడుదలైన విడుదైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
కల్కి 2898 ఏడీ నుంచి మరో స్పెషల్ వీడియో - ఆ రోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ - Prabhas kalki 2898 AD
Kalki 2898 AD Bujji and Bhairava : కల్కి టీమ్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. బుజ్జి అండ్ భైరవ పేరుతో రూపొందించిన ప్రత్యేక వీడియోను ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. చిన్నారులకు వినోదం పంచే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్టు ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది.
Published : May 27, 2024, 9:48 PM IST
|Updated : May 27, 2024, 11:05 PM IST
దేశవ్యాప్తంగా బుజ్జితో ప్రమోషన్స్ - బుజ్జికి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్‌తో మేకర్స్ సంతృప్తిగా చెందారు. అందుకే మరో అడుగు ముందుకు వేసి దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో మూవీ యూనిట్‌తో పాటు ఈ కారును ప్రమోషన్స్‌లో తిప్పనున్నారు. అలానే బుజ్జితో సెల్ఫీ తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రేక్షకులు తెగ సంబరపడుతున్నారు. ఎప్పుడెప్పుడు బుజ్జి తమ నగరం వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Kalki 2898 AD Release Date : కాగా, ఇతిహాసాలతో ముడిపడిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బోల్డ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై గ్లింప్స్ కూడా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది.