ETV Bharat / state

పెళ్లి వేడుకల్లోకి 'పిలవని అతిథులు' - మీతోనే ఉంటూ మీకు తెలియకుండానే? - CHILDREN ROBBERIES IN HYDERABAD

పెళ్లి వేడుకల్లోకి అతిథులుగా వచ్చి దొరికిందంతా దోచుకెళ్లే ముఠా అరెస్ట్ - పెళ్లి వేడుకల్లో దొంగతనాలు చేస్తూ దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా ముఠా అరెస్ట్

RAJGARH GANG ROBBERIES IN HYDERABAD
Police Arrest Gang Attempting to Commit Theft in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2024, 10:38 AM IST

Police Arrest Gang Attempting to Commit Theft in Hyderabad : పెద్ద పెద్ద వేడుకల్లోకి అతిధులుగా వెళ్తారు. అందరితో కలిసి సరదాగా మాట్లాడుతున్నట్లు చేసి దొరికిందంతా దోచుకొని వెళ్తారు. వివాహ వేడుకల్లో దొంగతనాలు చేస్తూ దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాకు చెందిన ముఠాను ఆదిభట్ల పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ రెడ్డితో కలిసి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు.

పిల్లల్లో కలిసిపోయి చోరీ : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా బోడా ఠాణా పరిధిలోని గుల్ఖేడీ, కడియా సాన్సీ, హల్ఖేడీ గ్రామాల్లో మెజార్టీ ప్రజల ప్రధాన వృత్తి దొంగతనాలు చేయడం. చిన్నారుల్లో దొంగతనాల నైపుణ్యం పెంచేందుకు ఇక్కడి ముఠాలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ మూడు గ్రామాల్లోనే దాదాపు 1200 మంది నేరస్థులు ఉంటారని తెలిపారు.

గుల్ఖేడీ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అరుడ(38), అన్నాదమ్ములైన రిషి(19), అభిషేక్‌(25) ముగ్గురూ వేర్వేరు ప్రాంతాల్లో చిన్నపాటి చోరీలు చేసేవారు. దీంతో చిన్న చిన్న దొంగతనాలు కాకుండా ఒకేసారి పెద్దమొత్తంలో చోరీ చేయాలని స్కెచ్ వేశారు. ఇందుకు అరుడ తన సోదరుడి 12 ఏళ్ల కుమారుడిని ఎంచుకున్నాడు. ధనవంతుల వివాహాలు ఆడంబరంగా జరుగుతాయని అక్కడికి వచ్చే వారి బ్యాగులు కొట్టేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని పథకం వేశారు. నగర శివార్లలోని రిసార్టులో ఇలాంటివి జరుగుతాయని తెలుసుకుని సమీప బంధువు దగ్గర కారు అద్దెకు తీసుకుని ఈ నెల 12న నగరానికి వచ్చారు. ఇక్కడే మకాం వేసి రెండు రోజుల పాటు హైదరాబాద్‌-విజయవాడ, సాగర్‌ రహదారిపై కొన్ని ఫంక్షన్‌ హాళ్లలో చోరీకి యత్నించి విఫలమయ్యారు.

ఈనెల 14న నగర శివారులోని ట్రాంక్విల్‌ రిసార్టులో వివాహ వేడుక జరుగుతుందని ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసి ఫ్లెక్సీని చూసి తెలుసుకున్నారు. అడ్రస్​ తెలుసుకొని రిసార్టుకు చేరుకున్నారు. వివాహ వేడుక జరిగే ప్రాంగణానికి అభిషేక్‌ మినహా మిగిలిన ముగ్గురూ అతిథుల్లా వెళ్లారు. అరుడ, రిషి అంతా గమనిస్తున్నారు. 12 ఏళ్ల బాలుడు అక్కడ చిన్నారులతో ఆటలాడుతూ కలిసిపోయాడు. డబ్బులు, నగలున్న బ్యాగు కోసం వెతికే క్రమంలో ఓ మహిళ ఫొటో దిగేందుకు 18 తులాల బంగారం ఉన్న బ్యాగును కుర్చీలో పెట్టింది. దీంతో చిన్నపిల్లల్లో కలిసిపోయిన బాలుడు అదనుచూసి ఆ బ్యాగును కొట్టేశాడు. బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ ఫుటేజీ ద్వారా దొరికిన దొంగలు : దీంతో రంగంలోకి దిగిన ఆదిభట్ల పోలీసులు వివాహ వేడుకల్లోని సీసీ పుటేజీ ఆధారాలు సేకరించారు. 12 ఏళ్ల బాలుడు చోరీ చేసే దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లా నేరగాళ్ల పనేనని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లోని ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్‌లోని గుల్ఖేడీ గ్రామానికి వెళ్లారు. అక్కడి స్థానికుల పోలీసుల సాయంతో బాలుడు, అరుడని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి నుంచి 38 తులాల బంగారం, కారు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

'ఆ ఏరియాలో బాగా రిచ్​ పీపుల్ ఉంటారు - రెండు ఇళ్లు దోచామంటే కోటీశ్వరులమైపోతాం'

తెల్లవారుజామునే హైదరాబాద్​లో రెండు చోట్ల సెల్​​ఫోన్ చోరీ ఘటనలు - దర్యాప్తులో షాకింగ్ నిజాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.