Pawan Kalyan Ustaad Bhagat Singh :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
స్క్రిప్ట్‌లో మార్పులు!
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ స్క్రిప్ట్‌లో దర్శకుడు హరీశ్ శంకర్ మార్పులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ అభ్యర్థన మేరకు హరీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం పవన్, హరీశ్‌ను కలిశారని, ఆ సమయంలోనే స్క్రిప్ట్‌లో మార్పులు చేయమని సూచించారని వార్తలు వినిపిస్తున్నాయి. డైలాగ్ వెర్షన్‌ను కూడా మార్చమని పవన్ కోరారని, అందుకు తగ్గట్లు హరీశ్ స్క్రిప్ట్ రీవర్క్ చేస్తున్నారని సమాచారం. అలాగే 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ త్వరలోనే హైదరాబాద్‌లో జరగనున్నట్లు సమాచారం. పవన్ వీలును బట్టి షూటింగ్లో పాల్గొంటారని టాక్.
గబ్బర్ సింగ్ తర్వాత క్రేజీ
కాగా, 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో వస్తుండటం వల్ల 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్‌గా రాబోతుందీ చిత్రం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గతేడాదే మొదలు పెట్టారు మేకర్స్. మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక పవన్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో, త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కనుంది.