Parineeti Chopra Ranveer Singh : రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరితో ఎంతో సరదాగా ఉంటాడు. అయితే అతడితో తనకున్న స్నేహబంధాన్ని వివరించింది హీరోయిన్ పరిణీతి చోప్రా. తామిద్దరి మధ్య స్నేహం ఇప్పటిది కాదని, చాలా కాలం నుంచి ఉందని చెప్పుకొచ్చింది. రణ్‌వీర్‌కు అస్సలు సిగ్గులేదని, అతడి సీక్రెట్స్‌ను ఫన్నీగా షేర్ చేసుకుంది. కాగా, వీరిద్దరు కలిసి 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
"నేను రణవీర్ చేసే పనులకు బాగా అలవాటు పడిపోయాను. కెమెరా ముందు ఏం జరుగుతుందో అది మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. కానీ వాస్తవానికి రణవీర్ బట్టల్లేకుండానే తిరుగుతుంటాడు. ప్యాంట్ వేసుకోకుండానే పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి రెండ్రోజులకు ఒకసారి జరిగే తంతు ఇది. ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడు. నేను ఇతర మేకప్ వ్యాన్‌లోకి వెళ్లేటప్పుడు సాధరణంగానే వెళ్లిపోతాను. కానీ రణవీర్ వ్యాన్‌లోకి వెళ్లడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే అతడు నిద్రపోతూ ఉంటాడు. లేదంటే వాష్ రూంలో ఉంటాడు. అసలు ఒక్కోసారి బట్టలు లేకుండానే ఉంటాడు. నాకు అది అలావాటు అయిపోయింది. వ్యాన్‌లోకి వెళ్లి మాట్లాడుతూ ఉంటే బట్టలు లేకుండానే అలాగే ఆన్సర్ చేస్తుంటాడు" అని పరిణీతి సెట్లో అనుభవాలు పంచుకుంది.
అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావని అడిగితే, తనని అలా చూడడం వల్ల ఇతరుల జీవితాల్లో ఏం మార్పులు రావు కదా. దానికి గురించి ఎందుకంత బాధ అని అంటుంటాడట. ఒకసారి పరిణీతి ఒక రొమాంటిక్ ఎమోషనల్ సీన్ కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి ప్యాంట్ లేకుండా రణ్వీర్ సెట్లో కనిపించాడట. ఇలా తనకు ఇబ్బందిగా ఉందని స్క్రిప్ట్‌లో ఉన్నట్లు కనిపించమని చెప్పడంతో వెంటనే ప్యాంట్ వేసుకుని వచ్చాడట.