ETV Bharat / entertainment

ప్రియుడి గురించి ఫస్ట్​ టైమ్ రివీల్ చేసిన కీర్తి సురేశ్ - అతడేనా? - KEERTHY SURESH ANTONY RELATIONSHIP

రిలేషన్​షిప్ గురించి కీర్తి సురేశ్ ఏమంటున్నారంటే?

Keerthy Suresh Antony Relationship
Keerthy Suresh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 12:10 PM IST

Keerthy Suresh Antony Relationship : కోలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేశ్​ తాజాగా తన రిలేషన్​షిప్​ గురించి ఓపెనప్​ అయ్యారు. ఆంటోనీ అనే వ్యక్తితో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఆమె దిగిన ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడీ అఫీషియల్ అనౌన్స్​మెంట్​తో అన్ని రూమర్స్​కు ఓ క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.

గతంలోనూ ఆమె పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని ఆమెతో పాటు తన ఫ్యామిలీ ఖండించారు. ఆ తర్వాత ఆంటోనీ పేరు తెగ ట్రెండ్ అయ్యింది. తన స్నేహితుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలోనూ ప్రచారం జరిగింది. ఇంజినీరింగ్‌ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశారని, ప్రస్తుతం ఆయనకు కేరళలో బిజినెస్​ చేస్తున్నారని టాక్‌ నడిచింది. ఇక కాలేజీ రోజుల నుంచి కీర్తి - ఆంటోనీ స్నేహితులని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అలా గతంలోనే ఈ ఇద్దరూ పేర్లు నెట్టింట తెగ ట్రెండైనప్పటికీ ఎవ్వరూ ఈ రూమర్స్​పై స్పందించలేదు. తాజాగా కీర్తి తండ్రి కూడా తమ కుమార్తె పెళ్లి గురించి త్వరలోనే చెప్తామని వెల్లడించడం వల్ల అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

ఇక కీర్తి కెరీర్ విషయానికి వస్తే, ​'గీతాంజలి' అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈమె 'నేను శైలజ'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మంచి ఆఫర్లు అందుకుని దూసుకెళ్లారు. 'మహానటి'తో పాన్​ఇండియా లెవెల్​లో పాపులర్ అవ్వడమే కాకుండా ఆ చిత్రానికిగానూ ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

అయితే రీసెంట్​గా విడుదలైన 'రఘుతాత' మిక్స్​డ్​ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్‌ రీటా', 'బేబీ జాన్‌' సినిమాల్లో వర్క్​ చేస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ లీడ్​ రోల్​లో భారీ అంచనాలతో ఈ చిత్రం 'బేబీ జాన్‌' తెరకెక్కనుండగా, కీర్తికి ఇది బాలీవుడ్‌లో తొలి సినిమా కావడం విశేషం.

'మహానటి' ఇంట్లో పెళ్లి బాజాలు నిజమే!- ఆ రోజే కీర్తి తండ్రి అనౌన్స్ చేస్తారట!

'అప్పుడు మా అమ్మకు 16 ఏళ్లు.. షూటింగ్ సమయంలో చిరు అలా చూసుకునేవారట'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.