ETV Bharat / business

క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్​ను​ కంపెనీలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్! - CREDIT CARD BENEFITS

క్రెడిట్‌ కార్డు బెనిఫిట్స్​ను నిలిపివేయడం/తగ్గిస్తున్న కంపెనీలు - అప్పుడు ఏం చేయాలంటే?

Credit Card Withdrawing Benefits
Credit Card Withdrawing Benefits (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 1:47 PM IST

Credit Card Withdrawing Benefits : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నచిన్న అవసరాలకు కూడా క్రెడిట్ కార్డును వాడేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డుల తప్పుడు వినియోగాన్ని అడ్డుకునేందుకు జారీ సంస్థలు ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. మరికొన్ని క్రెడిట్ కార్డు జారీ సంస్థలు పూర్తిగా బెనిఫిట్స్​ను ఉపసంహరించుకుంటున్నాయి. క్రికెట్ కార్డును బెనిఫిట్స్ కోసమే తీసుకునేవారికి, దానిపై వచ్చే ప్రయోజనాలను అకస్మాత్తుగా ఉపసంహరించడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కస్టమర్ ముందున్న ఆప్షన్​ ఏంటంటే?

ఆర్​బీఐ మార్గదర్శకాల ప్రకారం
క్రెడిట్ కార్డును జారీ చేసే బ్యాంకులు బెనిఫిట్స్ వంటిని తగ్గించినా, ఉపసంహరించుకున్నా కస్టమర్​కు నోటీసు ఇవ్వాలి. అలాగే ఎప్పటి నుంచి రివార్డు పాయింట్లు, బోనస్​లపై పరిమితిని విధిస్తున్నామో క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వినియోగదారుడికి తెలియజేయాలి. కాలపరిమితి స్పష్టంగా పేర్కొనాలి. నిర్ణీత గడువులోగా కస్టమర్ తన నిర్ణయాన్ని తెలియజేయకపోతే, కార్డు జారీ సంస్థ లేదా బ్యాంకు తాము చేసిన మార్పులను వినియోగదారుడు అంగీకరించినట్లుగా భావించవచ్చు. కస్టమర్​కు నిబంధనలు నచ్చకపోతే కార్డును సరెండర్ చేయవచ్చు. క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వడ్డీ కాకుండా ఇతర ఛార్జీలలో మార్పులు చేయాలనుకుంటే ఒక నెల ముందే కస్టమర్​కు నోటీసు ఇవ్వాలి.

క్రెడిట్ కార్డు బెనిఫిట్స్​పై ఆంక్షలు
పలు ప్రయోజనాలతో అందిస్తున్న క్రెడిట్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయన్న కారణంతో జారీ సంస్థలు ఇటీవల కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. వివిధ క్రెడిట్‌ కార్డులపై ఇస్తున్నటువంటి రివార్డు పాయింట్లను తగ్గిస్తున్నాయి. ఇటీవలే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకిచ్చింది. గ్రాసరీ, బీమా కొనుగోళ్ల ఖర్చులపై ఇస్తున్న రివార్డు పాయింట్లను తగ్గించింది. అలాగే హై-ఎండ్ కార్డుల్లో స్పా యాక్సెస్​ను నిలిపివేసింది. దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ కావాలంటే ప్రతి త్రైమాసికంలో రూ.75వేల ఖర్చు చేయాలని నిబంధనలు విధించింది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు సైతం
అలాగే హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు కూడా క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాకిచ్చింది. ఖర్చులు, టెలికాం, కేబుల్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను ఎత్తివేసింది. అదే విధంగా యస్ బ్యాంక్ ఫ్లైట్, హోటల్ బుకింగ్​ల కోసం ఇచ్చే రివార్డు పాయింట్లపై పరిమితి విధించింది.

'ఆ విషయాన్ని కస్టమర్​కు తెలియజేయాల్సిందే'
క్రెడిట్ కార్డు జారీ సంస్థలు బెనిఫిట్స్, ఛార్జీలలో మార్పులు చేస్తే కస్టమర్​కు కచ్చితంగా తెలియజేయాలి. వినియోగదారుడు తన క్రెడిట్ కార్డును ఎటువంటి ఛార్జీలను చెల్లించకుండానే జారీ సంస్థకు కార్డును సరెండర్ చేయవచ్చు. అతడి అభ్యర్థనను క్రెడిట్ కార్డు ఇష్యూ చేసేవారు తక్షణమే స్వీకరించాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.