ETV Bharat / entertainment

డేంజరస్​ గేమ్ మళ్లీ వచ్చేస్తోంది - ఈ భయంకరమైన ట్రైలర్ చూశారా? - SQUID GAME 2 TRAILER RELEASED

ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను దక్కించుకున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ 'స్క్విడ్‌ గేమ్‌ 2' ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్​..

Squid Game 2 Trailer Released
Squid Game 2 Trailer Released (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 10:32 AM IST

Squid Game 2 Trailer Released : ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను దక్కించుకున్న కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా 2021లో విడుదలై సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా 'స్క్విడ్‌ గేమ్‌ 2' రెడీ అవుతోంది. డిసెంబర్‌ 26 నుంచి నెట్​ఫ్లిక్స్​లో ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ఈ సీక్వెల్​కు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేశారు.

తొలి సీజన్‌ తరహాలోనే రెండో సీజన్​లోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంత మంది, డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్‌లో భాగం అవుతారు. అయితే గత సీజన్‌లో ఈ డేంజరస్​ గేమ్​ నుంచి బయటపడిన 456వ పోటీ దారుడు సియోంగ్ గి-హున్ ఇందులో మళ్లీ పాల్గొంటాడు. ఈ గేమ్ చాలా డేంజరస్​ అని తోటి పోటీ దారులకు హెచ్చరిస్తాడు. ఎలాగైనా ఈ గేమ్‌ను ఆపాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ గేమ్​ను ప్రవేశపెట్టిన వారికి అంతమొందించాలనుకుంటాడు. మరి ఇంతకీ అతడు ఈ గేమ్​ను ఆపగలిగాడా లేదా అన్నదే కథ.

ఇంతకీ ఈ 'స్క్విడ్‌ గేమ్‌' స్టోరీ ఏంటంటే?

జీవితంలో సర్వస్వం కోల్పోయి, అప్పులపాలైన ఓ 456 మందిని రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్‌లైట్‌, గ్రీన్‌లైట్‌, టగ్ ఆఫ్‌ వార్‌ వంటి ఆటల పోటీలను నిర్వహిస్తారు. మొత్తం ఆరు గేమ్స్ ఉంటాయి. చివరగా వచ్చేదే​ 'స్క్విడ్‌ గేమ్'. ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచినవారు మాత్రమే భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చు. కానీ, ఈ గేమ్స్​లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్‌ అనే పేరుతో చంపేస్తుంటారు.

సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌ కొరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. చేసుకుంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే సుమారు 111 మిలియన్ల వ్యూస్‌తో తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో ఈ సిరీస్​ డైరెక్టర్ హ్వాంగ్​ డాంగ్ హ్యూక్​(Squid Game Director) హర్షం వ్యక్తం చేశారు.

ఆగని 'బుజ్జి తల్లి' సాంగ్ జోరు​ - యూట్యూబ్​, ఇన్​స్టాలో సెన్సేషన్ రికార్డ్​

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ప్రముఖ నటుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.