ETV Bharat / entertainment

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ - 'కన్నప్ప' రిలీజ్‌ డేట్ ఫిక్స్​ - KANNAPPA RELEASE DATE

కన్నప్ప రిలీజ్ డేట్​ను ప్రకటించిన మూవీ టీమ్.

Kannappa Release Date
Kannappa Release Date (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 10:39 AM IST

Manchu Vishnu Kannappa Release Date : మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'కన్నప్ప'. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉంటుందా, ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందా? అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ మేరకు విడుదల తేదీని మంచు విష్ణు ప్రకటించారు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'పరమేశ్వరుడి గొప్ప భక్తుడి కథ తెలుసుకునేందుకు సిద్ధం అవ్వండి" అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. మహాభారత’ సిరీస్‌ను రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని డెరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌ గెస్ట్ రోల్​లో కనిపించనున్నారు. మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌, మధు బాల, ప్రీతి ముకుందన్‌, మోహనల్​ లాల్, శివ రాజ్​ కుమార్ అక్షయ్​ కుమార్​ సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు తనయుడు అవ్రామ్‌ ఈ చిత్రంతో అరంగేట్రం చేయనున్నారు. బాల తిన్నడుగా అతడు కనిపించనున్నాడు.

కాగా, ఆ మధ్య విడుదలైన 'కన్నప్ప' టీజర్ పర్వాలేదనిపించింది. శివనామ స్మరణతో మొదలై ఆ నామస్మరణతోనే ముగిసిందీ ప్రచార చిత్రం. తిన్నడు పాత్రలో విష్ణు పరిచయమైన తీరు, యుద్ధ ఘట్టాల్లో ఆయన చేసిన సాహసాలు, ఆఖర్లో అతిథి పాత్రల్లో ప్రభాస్, అక్షయ్‌ కుమార్‌లు తళుక్కుమనడం, సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ సినిమాటో గ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, డ్యాన్స్​ మ్యాస్ట్రో ప్రభుదేవా వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించి ఎక్కువ భాగాన్ని న్యూజిలాండ్​లోనే చిత్రీకరించారు.

ఈ వారమే OTTలోకి భారీ బ్లాక్ ​బస్టర్​ సినిమా - ఇంకా థియేటర్లలో రానున్న చిత్రాలేంటంటే?

'ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా?' - రష్మిక సమాధానానికి దద్దరిల్లిన ఆడిటోరియం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.