Hyderabad VIjayawada National Traffic Diversion : రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈనెల 19 వరకు హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
- హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నుంచి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా అనుమతిస్తున్నారు.
- విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను కోదాడ వద్ద మళ్లిస్తున్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి ప్రాంతాల మీదుగా వాహనాలను అనుమతిస్తున్నారు.
- హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లేటువంటి వాహనాలను బీబీగూడెం మీదుగా మళ్లిస్తున్నారు.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరకు సర్వం సిద్ధం - నేటి నుంచి ఆ రూట్లలో ఆంక్షలు