ETV Bharat / offbeat

ఎంతో రుచికరమైన శబరిమల "అరవణ ప్రసాదం" - ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!

-అరవణ ప్రసాదంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -ఈ విధంగా చేస్తే ఎంతో కమ్మటి రుచి!

How to Make Ayyappa Prasadam Recipe
How to Make Ayyappa Prasadam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Make Ayyappa Prasadam Recipe : తిరుపతి లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మాదిరి.. చాలా మంది శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాన్నీ ఎంతో ఇష్టపడతారు. తెలిసిన వారు ఎవరైనా శబరిమలకు వెళ్తే.. కచ్చితంగా అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తీసుకురమ్మని చెబుతుంటారు. టిన్​లో ప్యాక్ చేసి పాకంలా ఉండే ఆ పాయసం చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతుంటారు. మరి అంతటి రుచికరమైన అరవణ ప్రసాదాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని టిప్స్​ పాటిస్తూ చేస్తే అచ్చం శబరిమలలో లభించే ప్రసాదం రుచి వస్తుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారి విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

  • రెడ్​ రైస్​ - కప్పు
  • ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్​స్పూన్లు
  • నెయ్యి - 4 టేబుల్​స్పూన్లు
  • నల్ల ఎండు ద్రాక్ష - 2 టేబుల్​స్పూన్లు
  • నీళ్లు - సరిపడా
  • తాటి బెల్లం - మూడు కప్పులు
  • శొంఠిపొడి - టీస్పూన్​
  • యాలకులపొడి - టీస్పూన్​
  • కొద్దిగా పచ్చకర్పూరం

తయారీ విధానం :

  • ముందుగా ఒక గిన్నెలోకి రెడ్​ రైస్ తీసుకుని రెండు మూడుసార్లు శుభ్రంగా కడగి నీళ్లు లేకుండా పక్కన పెట్టండి.
  • ఇప్పుడు స్టౌపై ఒక పాన్ పెట్టండి. ఇందులో 2 టేబుల్​స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. ఆపై స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెడ్​ రైస్ వేయండి. రైస్​ని 5 నిమిషాల పాటు దోరగా కమ్మటి వాసన వచ్చేవరకు వేయించండి.
  • ఇప్పుడు బియ్యం తీసుకున్న కొలతతో మూడు కప్పుల వాటర్​ రైస్​లో పోయండి.
  • గిన్నెపై మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ అన్నం పొడిపొడిగా వండుకోండి. తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఇప్పుడు స్టౌపై బెల్లం కరిగించుకోవడం కోసం ఒక గిన్నె పెట్టండి. ఇందులో కప్పు వాటర్​ వేసుకుని సన్నగా తరిగిన మూడు కప్పుల తాటి బెల్లం వేసుకోండి.
  • బెల్లం పూర్తిగా కరిగే వరకు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి.. గరిటెతో తిప్పుతూ ఉండండి.
  • ఇప్పుడు కరిగిన బెల్లం పాకం జాలి గరిటె సహాయంతో ఉడికించుకున్న రైస్​లో పోసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచుకుని రైస్​ ఉడికించుకోవాలి. రైస్​ అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
  • ప్రసాదం కాస్త చిక్కబడేటప్పుడు ఎండుకొబ్బరి ముక్కలు, నల్ల ఎండు ద్రాక్ష వేసుకుని కలుపుకోవాలి.
  • తర్వాత మధ్యమధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • తర్వాత శొంఠిపొడి, యాలకులపొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆపై కొద్దిగా నెయ్యి వేసి కలపండి. ఇప్పుడు 15 నిమిషాలు ఉడికించుకోండి. ఆపై స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన అయ్యప్ప స్వామి ప్రసాదం తయారైపోతుంది.
  • దీనిని ఫ్రిడ్జ్​లో నిల్వ ఉంచుకుంటే నెల రోజులపాటు తినచ్చు.
  • ఈ ప్రసాదం తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

శబరిమల ప్రసాదం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? - అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి!

అయ్యప్ప స్వాములు మెచ్చే "సాత్విక భోజనం" - ఉల్లి, వెల్లుల్లి లేకుండా చక్కగా సిద్ధం చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.