ETV Bharat / entertainment

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి - 'ఆ వార్తల్లో నిజం లేదు' - NAGACHAITANYA SOBHITA WEDDING

ఆ వార్తల్లో నిజం లేదని తెలిపిన నాగ చైతన్య టీమ్​ - ఇంతకీ అదేంటంటే?

Naga Chaitanya Sobhita Dhulipala wedding Video
Naga Chaitanya Sobhita Dhulipala wedding Video (source Nagarjuna twitter)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 10:42 AM IST

Naga Chaitanya Sobhita Dhulipala wedding Video : అక్కినేని హీరో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో వీరి పెళ్లి జరగనుంది. అయితే ఈ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో రూపొందించనున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ కథనాలపై అక్కినేని టీమ్‌ స్పందించింది. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే సింపుల్‌గా పెళ్లి నిర్వహించాలనే ఉద్దేశంలో కొత్త జంట ఉందని పేర్కొంది.

కాగా, డిసెంబర్‌ 4న నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగనుంది. అక్కినేని ఫ్యామిలీ సెంటిమెంట్‌గా భావించే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరగనుంది. ఆ స్టూడియోలోని ఏయన్నార్‌ విగ్రహం ఎదురుగా శోభిత - చైతూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని రీసెంట్​గానే ఓ ఇంటర్వ్యూలో చైతన్య పేర్కొన్నారు. ఏయన్నార్‌ ఆశీస్సులు కొత్త జంటపై ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఈ డెసిషన్​ తీసుకున్నట్లు చైతూ తెలిపారు.

ఈ వివాహ వేడుకకు ఫ్యామిలీ మెంబర్స్​తో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు రానున్నారు. సంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఈ క్రమంలోనే ఈ పెళ్లి తంతును డాక్యుమెంటరీ రూపంలో రూపొందించనున్నారని, దీని రైట్స్​ కోసం నెట్‌ఫ్లిక్స్‌ రూ.50 కోట్లు ఖర్చుపెట్టిందని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు అక్కినేని టీమ్ స్పందించడం వల్ల అందులో నిజం లేదని తేలింది.

ఇకపోతే రీసెంట్​గానే కాబోయే భార్య శోభిత గురించి నాగ చైతన్య తాజాగా తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. శోభితతో కొత్త లైఫ్​ను ప్రారంభించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు చెప్పిన ఆయన, ఆమెతో బాగా కనెక్ట్‌ అయినట్లు చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అలానే తాను కోరుకున్న ప్రేమను చైతన్యలో చూశానని గతంలో శోభిత చెప్పింది.

ఆగని 'బుజ్జి తల్లి' సాంగ్ జోరు​ - యూట్యూబ్​, ఇన్​స్టాలో సెన్సేషన్ రికార్డ్​

డేంజరస్​ గేమ్ మళ్లీ వచ్చేస్తోంది - ఈ భయంకరమైన ట్రైలర్ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.