ETV Bharat / state

ఇంటర్​ విద్యార్థుల ఫోన్లకే హాల్​ టికెట్లు - ఇలా డౌన్​లోడ్​ చేసేయండి - INTER HALL TICKETS SENT TO PHONES

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫోన్లకే హాల్‌టికెట్లు- లింక్‌ ద్వారా పంపించనున్న బోర్డు - డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచన

Inter Hall Tickets Will Sent To Phones
Inter Hall Tickets Will Sent To Phones (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 10:09 AM IST

Updated : Jan 30, 2025, 10:47 AM IST

Inter Hall Tickets Will Sent To Phones : ఇంటర్మీడియట్​ విద్యార్థుల ఫోన్లకే హాల్​ టికెట్లు రానున్నాయి. గతంలో కేవలం కాలేజీలకే హాల్​ టికెట్లను బోర్డు పంపించేది. ఆ తర్వాత వెబ్​సైట్​లో పెట్టి డౌన్​లోడ్​ చేసుకోవాలనేవారు. ఇప్పుడు విద్యార్థులు ఇచ్చిన ఫోన్​ నంబర్​కు నేరుగా హాల్​ టికెట్​ లింక్​ను ఇంటర్​ బోర్డు పంపించనుంది. ఆ లింక్​లో డౌన్​లోడ్​ చేసుకొని ప్రింట్​ తీసుకోవాలని ఓ అధికారి తెలిపారు. ఏవైన సందేహాలుంటే కాలేజీ సిబ్బందిని అడిగి తెలుసుకోవాలన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు సమస్యలు తలెత్తితే కళాశాలకు వచ్చి సమస్య తెలియజేయాలన్నారు.

ఇవాళ్టి నుంచి ఇంటర్​ ఫస్ట్​ ఇయర్​ విద్యార్థులకు ఇంటర్నల్​ పరీక్షలు జరుగుతున్నందున ఇప్పటికే హాల్​ టికెట్లను విద్యార్థులకు పంపించారు. సెకండ్‌ ఉయర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్‌ ఉన్నాయి. వారి కూడా త్వరలోనే పంపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలు
05-03-2025సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1
07-03-2025ఇంగ్లిష్‌ పేపర్-1
11-03-2025గణితం పేపర్‌-1ఏ; బోటనీ పేపర్‌-1; పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1
13-03-2025గణితం పేపర్‌ -2బి; జువాలజీ పేపర్‌-1; హిస్టరీ పేపర్‌-1
17-03-2025ఫిజిక్స్ పేపర్‌-1; ఎకనామిక్స్‌ పేపర్‌-1
19-03-2025మిస్ట్రీ పేపర్‌-1; కామర్స్‌ పేపర్‌-1
19-03-2025పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1; బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-1 (బైపీసీ విద్యార్థులకు)
24-03-2025మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1; జాగ్రఫీ పేపర్‌-1

కొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం - మీ పిల్లలు ఒత్తిడితో ఉంటే ఇలా చేయండి

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల తేదీలు
06-03-2025సెంకడ్‌ లాంగ్వేజ్ పేపర్‌-2
10-03-2025ఇంగ్లిష్‌ పేపర్-2
12-03-2025గణితం పేపర్‌ -2ఏ; బోటనీ పేపర్‌-2; పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2
15-03-2025గణితం పేపర్‌ -2బి; జువాలజీ పేపర్‌-2; హిస్టరీ పేపర్‌-2
18-03-2025ఫిజిక్స్ పేపర్‌-2; ఎకనామిక్స్‌ పేపర్‌-2
20-03-2025కెమిస్ట్రీ పేపర్‌-2; కామర్స్‌ పేపర్‌-2
22-03-2025పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2; బ్రిడ్జ్‌ కోర్సు గణితం పేపర్‌-2 (బైపీసీ విద్యార్థులకు)
25-03-2025మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2; జాగ్రఫీ పేపర్‌-2

ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే పరీక్ష కేంద్రాలు ఇవ్వం : మరోవైపు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని బోర్టు ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా థియరీ పరీక్షలకు కేంద్రాలను ఇవ్వబోమని తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ తెలిపారు. ఈ మేరకు బోర్డును హెచ్చరించారు. త్వరగా నిర్ణయం తీసుకుంటే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురుకావన్నారు. బుధవారం జరిగిన సంఘం రాష్ట్రం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ఈ విషయం సీఎంతో చర్చిస్తామన్నారు.

పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలా? - ఈ టిప్స్ ఫాలో అయితే ఇట్టే వచ్చేస్తాయి!

Last Updated : Jan 30, 2025, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.