Odisha Woman Who Came For Surrogacy Lost Her Life : హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత (25) సరోగసీ కోసం వచ్చి ఓ అపార్ట్‌మెంట్ 9వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రాజేశ్ బాబు అనే వ్యక్తి, ఒడిశా నుంచి వచ్చిన ఓ మహిళతో సరోగసి ద్వారా బిడ్డను కనిచ్చేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెల రోజులుగా బయటికి వెళ్లనివ్వకుండా, తన భర్తతో మాట్లాడనివ్వకుండా నిర్బంధం చేశాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ యత్నించింది. చీర సహాయంతో తొమ్మిదో అంతస్తు నుంచి ఆరో అంతస్తులోకి దిగే యత్నంలో పట్టుతప్పి కిందపడి మృతి చెందింది. తన భార్యతో లైంగిక వేధింపులకు పాల్పడడంతో అతని నుంచి తప్పించుకోవడానికి దూకినట్లు వివాహిత భర్త రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.