తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగా మనవరాళ్లతో చిరు - క్లీంకార ఫొటోతో ఉపాసన సర్​ప్రైజ్​! - Upasana Padmavibhusan Chiranjeevi

Padmavibhusan Chiranjeevi Upasana : మెగాకోడలు ఉపాసన తన మామయ్య పద్మవిభూషణ్​ చిరంజీవికి ఓ సర్​ప్రైజ్ ఇచ్చింది. ఆ వివరాలు.

మెగా మనవరాళ్లతో చిరంజీవి - క్లీంకారను చూశారా?
మెగా మనవరాళ్లతో చిరంజీవి - క్లీంకారను చూశారా?

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 7:22 PM IST

Updated : Jan 26, 2024, 9:06 PM IST

Padmavibhusan Chiranjeevi Upasana : మెగాస్టార్ చిరంజీవి నేటి నుంచి పద్మ విభూషణ్ చిరంజీవిగా మారిపోయిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే రెండో అత్యున్నతమైన పురస్కారం చిరును వరించడంతో అభిమానులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీ మొత్తం ఆయన గురించే మాట్లాడుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతోంది.

ఈ నేపథ్యంలోనే చిరుకు మెగా కోడలు ఉపాసన ఓ సర్​ప్రైజ్​ ఫోటోతో శుభాకాంక్షలు తెలిపింది. మెగా మనవరాళ్లతో చిరు దిగిన ఫోటోను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్​లో చిరు పెద్ద కూతురు సుష్మిత పిల్లలు సమారా, సంహితతో పాటు శ్రీజ పిల్లలు నివ్రితి, నివిష్క ఉన్నారు. మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార కూడా ఉంది. కానీ ఆమె మొఖాన్ని మాత్రం రివీల్‌ చేయలేదు. మొఖం స్పష్టంగా కనిపించకుండా కాస్త బ్లర్‌ చేసి చూపించారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను చూసిన మెగా ఫ్యాన్స్‌ ఆ పిక్​ను సోషల్ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. " మీరు చూసేది శక్తివంతమైన పిడికిలిని ఏర్పరిచే ఐదు వేళ్లు. కేవలం సినిమా, దాతృత్వంలోనే కాదు జీవితంలోనూ నాన్నగా, మామగారిగా, తాతగా మా స్ఫూర్తికి అభినందనలు. చిరుత, పద్మవిభూషణ్. లవ్ యూ" అంటూ ఉపాసన రాసుకొచ్చింది.

Chiranjeevi Viswambara Movie :ఇకపోతే ప్రస్తుతం చిరు 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ఠతో ఈ సినిమా చేస్తున్నారు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధం కానుంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు మరి ఈ చిత్రం చిరుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

జీవితంలో గెలవాలంటే - చిరు చెప్పిన 9 సూక్తులు ఇవే

చిరంజీవికి పద్మ విభూషణ్‌ - అల్లు అర్జున్‌, రామ్​చరణ్​ ఏమన్నారంటే?

Last Updated : Jan 26, 2024, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details