తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం టాప్ 10 సిరీస్​ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా​! - OTT Top 10 Web Series

OTT Top 10 Web Series : ఓటీటీ వచ్చాక సినిమా, సిరీస్​లు చూసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. మరి ఈ వారంలో టాప్ 10 విశేష ఆదరణ దక్కించుకున్న సిరీస్​లు ఏంటో తెలుసుకుందాం.

ఈ వారం టాప్ 10 సిరీస్​ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా​!
ఈ వారం టాప్ 10 సిరీస్​ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా​!

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 4:26 PM IST

Updated : Mar 9, 2024, 5:21 PM IST

OTT Top 10 Web Series : సంగతి తెలిసిందే. అలానే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చాలానే చిత్రాలు, సిరీస్​లు వస్తున్నాయి. ఈ మధ్య ఓటీటీ సంస్థలు ఒరిజినల్స్​ను ఎక్కువగా రూపొందిస్తున్నాయి. అందులో కొన్నింటికీ ఎక్కవ స్థాయిలో రెస్పాన్స్​ దక్కుతోంది. మరి ఈ వారంలో టాప్ 10 విశేష ఆదరణ దక్కించుకున్న సిరీస్​లు ఏంటో తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే : ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి తెలిసే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కెంటెంట్​ను ఇస్తుంటుంది. దేశవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంటున్న సినీ తారలు, సినిమాలు, వెబ్​సిరీస్​ల గురించి సర్వేలు చేయించి మరీ సమాచారాన్ని అందిస్తుంటుంది. అలానే తాజాగా ఓటీటీలో ఉన్న ఒరిజనల్స్​పై సర్వే చేసి ఈ వారం టాప్​ 10లో ఉన్న వాటి గురించి పోస్ట్ చేసింది.

ఇండియా వైడ్​గా అలియా భట్‌ నిర్మించిన క్రైమ్‌ సిరీస్‌ పోచర్‌ అగ్రస్థానంలో కొనసాగుతోందని చెప్పింది. ఎమ్మీ అవార్డు విన్నర్‌ రిచీ మెహతా దీనిని తెరకెక్కించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. కేరళ అడవుల్లో ఏనుగులను చంపుతూ వాటి దంతాల అక్రమంగా రవాణా చేస్తున్న సంఘటనపై సిరీస్​ను రూపొందించారు. వీటిని ఆపేందుకు అధికారులు చేస్తున్న పోరాటం, ఎంత మంది చనిపోతున్నారు వంటి సన్నివేశాల్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు.

ఇంకా జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న సన్​ఫ్లవర్ సీజన్ 2, నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోన్న మామ్లాలీగల్ హై రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి కుంద్రా, వివేక్‌ ఒబెరాయ్ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌ నాలుగు స్థానం దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్​ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.

ఇక హ్యుమా ఖురేషీ ప్రధాన పాత్రలో రాజకీయం నేపథ్యంలో రూపొందిన మహారాణి సీజన్ 3 సిరీస్‌ ​ సోనీలివ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఐదో స్థానంలో నిలవగా, అవతార్ ది లాస్ట్ ఎయిర్​బెండర్​ ఆరో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ : ది బర్రీడ్‌ ట్రూత్‌ డాక్యూమెంటరీగా నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతూ ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

భూమి పెడ్నేకర్ నటించిన ఇన్వెస్టిగేషన్​ థ్రిల్లర్​ భక్షక్(నెట్​ఫ్లిక్స్​)​ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక షోటైమ్(డిస్నీ హాట్ స్టార్​), షోగన్(డిస్నీ హాట్ స్టార్​ ప్లస్​) కూడా టాప్​ 10లో చివరి రెండు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.

ఉత్కంఠగా సలార్ విలన్​ కొత్త మూవీ ట్రైలర్ - ఇది పక్కా మరో మాస్టర్ పీస్​!

'9వ తరగతి వరకు చెప్పులు లేకుండానే - వాటిని భరించలేక ఇండస్ట్రీకి వచ్చా'

Last Updated : Mar 9, 2024, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details