OTT Best Crime Documentaries : ఓటీటీల్లో ఈ మధ్య ఒరిజన్సల్ క్రైమ్ వెబ్ సిరీస్, డాక్యూమెంటరీస్ ఎక్కువ తెరకెక్కుతున్నాయి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వాటిని రూపొందిస్తున్నారు. వీటికి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్‌లో మంచి క్రేజ్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో దొరికే బెస్ట్ క్రైమ్ డాక్యుమెంటరీలను చూద్దాం.
ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ- బరీడ్ ట్రూత్ రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. 4 ఎపిసోడ్లుగా తెరకెక్కింది. 2012లో ముంబయిలో జరిగిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ కేసులోని ట్విస్టులను కళ్లకు కట్టినట్లు డాక్యుమెంటరీలో చూపించారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ది తల్వార్స్ : బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ - 2008లో నోయిడాలో జరిగిన జంట హత్యల కేసు కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కేసు చుట్టూ తిరిగే డాక్యుమెంటరీ ఇది. ఆరుషి తల్వార్, వాళ్ల ఇంట్లో పని మనిషి హత్యకు గురి కావడం అప్పట్లో పెను సంచలనం రేపింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
డ్యాన్సింగ్ ఆన్ ద గ్రేవ్ - 1991లో షకీరే ఖలీలి హత్య కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిన విషయమే. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన షకీరే ఖలీలిని ఆమె రెండో భర్త హత్య చేశాడు. చాలా రోజుల నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న దీనికి కూడా విశేష ఆదరణ దక్కింది.