తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ హీరోయిన్​ ఆమెనేనా? - NTR Prasanth Neel Film Heroine - NTR PRASANTH NEEL FILM HEROINE

NTR Prasanth Neel Film Heroine : ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో సినిమా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతం వైరల్​గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 3:02 PM IST

NTR Prasanth Neel Film Heroine :ప్రస్తుతం యంగ్​ టైగర్​ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్​తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్​ ముందు అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. అయితే ఈ చిత్రం తర్వాత తారక్​​ ప్రశాంత్​ నీల్​తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానుంది.

తాజాగా అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమాలో ఓ హీరోయిన్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ అని అంటున్నారు. ఆమె మరెవరో కాదు కన్నడతో పాటు తెలుగులోనూ మంచి టాక్ అందుకున్న 'సప్త సాగరాలు దాటి' మూవీ హీరోయిన్ రుక్మిణి వసంత్​.

ఇప్పటికే రుక్మిణి వసంత్​తో చర్చలు కూడా జరిపారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతో పక్కాగా తెలీదు. దీనిపై ఓ స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా, ఇప్పటికే సప్త సాగరాలు దాటి చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులంతా రుక్మిణి అందానికి ఫిదా అయిపోయారు. అలానే తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆ మధ్య ప్రచారం సాగింది.

ఇకపోతే ప్రశాంత్ నీల్​ - ఎన్టీఆర్​ చేయాల్సిన సినిమాకు మైత్రీ మూవీకర్స్​, ఎన్టీఆర్ ఆర్ట్స్​ కలిసి నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల భారీ హిట్లతో పుల్​ జోష్ మీదున్న ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌ను ఈ చిత్రంలో ఎలా చూపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

స్టోరీ ఇదే - ఈ సినిమా కథ గురించి ఆ మధ్య ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ - "ఈ చిత్రాన్ని అందరూ ఓ యాక్షన్‌ సినిమాలా భావిస్తారు. కానీ, నేను నా జానర్‌లోకి వెళ్లాలని అనుకోవట్లేదు. వాస్తవానికి ఇది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన చిత్రం." అని చెప్పుకొచ్చారు.

'NTR 31' షూటింగ్ అప్​డేట్​ - ఆ షెడ్యూల్​లో తారక్ ఉండరట! - Jr Ntr 31 Shooting Update

టాలీవుడ్ అప్​కమింగ్ బడా ప్రాజెక్ట్స్​ - ​ఈ స్టార్​ హీరోల సరసన సొగసరి వీరేనా? - Tollywood Upcoming Movies Heroines

ABOUT THE AUTHOR

...view details