Nayanthara Dhanush Controversy: లేడీ సూపర్ స్టార్ నయనతార- హీరో ధనుశ్ మధ్య కాంట్రవర్సీ కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది. నయన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ విషయంలో హీరో ధనుశ్ తీరును ఆమె తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఆయనను విమర్శిస్తూ నయన్ రీసెంట్గా మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే వీరిద్దరూ ఒకే ఫంక్షన్లో కనిపించడం చర్చనీయాంశమైంది.
ఈవెంట్లో పక్కపక్కనే ధనుశ్, నయన్- కాపీరైట్స్ కాంట్రవర్సీ తర్వాత ఫస్ట్ టైమ్! - NAYANTHARA DHANUSH CONTROVERSY
పెళ్లి వేడుకలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ధనుశ్, నయన్- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
Published : Nov 21, 2024, 11:03 PM IST
కోలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ వివాహ వేడుక చెన్నైలోని ఓ కన్వెన్షన్ హాల్లో గురువారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతోపాటు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ధనుశ్, నయనతార కూడా పెళ్లిలో కనిపించారు. వీరిద్దరూ ఒకే వేదికపై మెరిశారు. ఈ పెళ్లిలో నయన్- ధనుశ్ పక్క పక్కనే కూర్చున్నారు. అయినప్పటికీ ఈ ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం ఒకరి మోహం ఒకరు కూడా చూసుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ వివాదం
'నానుమ్ రౌడీ దాన్' సినిమాకు సంబంధించి 3 సెకన్ల వీడియో క్లిప్‌ను డాక్యుమెంటరీ ట్రైలర్లో చూపించినందుకు రూ.10 కోట్లు నష్ట పరిహారంగా ధనుశ్ డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు లీగల్ నోటీసులు కూడా పంపించినట్లు చెప్పారు. దీంతో ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. పలువురు ఆమెకు మద్దతుగా నిలిచారు. కానీ ధనుశ్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు. అలాగే ఈ నేపథ్యంలో తన డాక్యుమెంటరీకి సహకరించిన వారందరికీ రీసెంట్గా నయనతార ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాద్షా షారుక్ ఖాన్‌కు సైతం థాంక్స్ చెప్పారు. కాగా, తాజాగా వీరిద్దరూ ఓకే ఫంక్షన్లో కనిపించడం వల్ల ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆమె డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది.