తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

6 వేల సంవత్సరాల కథతో 'కల్కి' - టైటిల్ సీక్రెట్ ఇదే : నాగ్​ అశ్విన్ - Kalki 2898 AD prabhas

Prabhas Kalki 2898 AD : సైన్స్‌ ఫిక్షన్‌ కల్కి 2898 ఏడీ సినిమా గురించి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ విషయాలను చెప్పారు. అసలీ చిత్రానికి కల్కి టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని కూడా తెలిపారు. ఆ వివరాలు.

Etv Bharat
6 వేల సంవత్సరాల కథతో 'కల్కి' - టైటిల్ సీక్రెట్ ఇదే : నాగ్​ అశ్విన్

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 12:11 PM IST

Updated : Feb 26, 2024, 1:16 PM IST

Prabhas Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న అత్యంత భారీ బడ్జెట్​ చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్​ కల్కి టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని వెల్లడించారు. అలాగే సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు.

"ఈ సినిమా కథ మహాభారతం కాలం నుంచి మొదలవుతుంది. 2898తో పూర్తవుతుంది. అంటే గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది. అందుకే ఈ టైటిల్​ను పెట్టాము. ఈ చిత్రంలో మొత్తం 6,000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించబోతున్నాం. నాటి రోజులకు తగట్టుగా ఓ ప్రపంచాన్ని కూడా క్రియేట్ చేశాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. గతంలో హాలీవుడ్‌లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ బ్లేడ్‌ రన్నర్‌ పోలికలు అస్సలు ఇందులో కనపడకుండా జాగ్రత్త పడ్డాం. ఇది మాకు సవాలు లాంటిది" అని చెప్పుకొచ్చారు. ఇక ఈ అప్డేట్ తెలుసుకుంటున్న అభిమానులకు సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాల్ని షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Kalki 2898 AD Cast and Crew :ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్​ ప్రభాస్‌కు జోడిగా హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది. మరో హిందీ హీరోయిన్​, హాట్ బ్యూటీ దిశా పటానీ, దిగ్గజ నటులు బిగ్​ బీ అమితాబ్‌ బచ్చన్‌, యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్​ విలన్​ రోల్ చేస్తున్నారని అంటున్నారు. ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ మధ్యే జస్ట్‌ ది వార్మ్‌ అప్‌ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన వీడియో కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. చూడాలి మరి ఇంతటి భారీ బడ్జెట్​తో, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో.

50 ఏళ్ల కెరీర్‌లో బాలయ్య గెస్ట్ రోల్‌ చేసిన ఒకే ఒక సినిమా ఏంటో తెలుసా?

లావణ్య త్రిపాఠితో లవ్​ - వరుణ్ తేజ్​పై కోపం పెంచుకున్న చిరు!

Last Updated : Feb 26, 2024, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details