తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రజనీ, అమితాబ్​లో అది కామన్ పాయింట్ : 'వేట్టాయాన్​' బ్యూటీ మంజు వారియర్ - Manju Warrier Vettaiyan - MANJU WARRIER VETTAIYAN

Manju Warrier About Rajinikanth: తొలిసారి రజినీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మంజూ వారియర్ ఈ సూపర్ స్టార్‌లోని స్పెషాలిటీ గురించి చెప్తున్నారు. రజినీతో పాటు మిగిలిన సూపర్ స్టార్లలో కామన్‌గా ఉండే విషయాన్ని బయటపెట్టారు.

Manju Warrier Vettaiyan
Manju Warrier Vettaiyan (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 5:00 PM IST

Manju Warrier About Rajinikanth : మలయాళీ నటి 'మంజూ వారియర్' రీసెంట్‌గా బాగా ఫేమస్ అయిపోయారు. 29 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ తమిళం, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించినా దక్కని పాపులారిటీని 'వేట్టయాన్' సినిమాతో సొంతం చేసుకున్నారు. ఆ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ 'మనసిలాయో' తెగ వైరల్ అయ్యింది. ఈ పాటకు తగ్గ స్టెప్పులు, ఆమె హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 'వేట్టయాన్' రిలీజ్ దగ్గర పడడం వల్ల ప్రమోషన్స్‌లో పాల్గొన్న మంజూ వారియర్ ఈ సాంగ్ గురించి మాట్లాడారు. దీంతోపాటుగా ఇప్పటివరకూ తను కో స్టార్‌గా నటించిన రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, అజిత్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టిలలో కామన్ విషయాన్ని బయటపెడుతూ తెగ పొగిడేశారు.

మంజూ వారియర్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రజినీకాంత్‌ను మొదటిసారిగా కలుసుకుంది వేట్టయాన్ సినిమా సెట్స్‌లోనేనట. లుక్ టెస్ట్ కోసం వెళ్లిన తనకు రజినీకాంత్‌లోని సింప్లిసిటీ బాగా నచ్చేసిందట. 'రజినీకాంత్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి కంఫర్టబుల్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. చాలా ప్రశాంతంగా, సింపుల్‌గా ఉన్నారు' అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ పలు ఇండస్ట్రీల్లోని సూపర్ స్టార్లతో మంజూ వారియర్ నటించారు.

రజినీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, అజిత్ కుమార్, మోహన్‌లాల్, మమ్ముట్టి వీళ్లందరిలో కామన్‌గా కనిపించే ఈ సింప్లిసిటీ ఆమెకు బాగా నచ్చేసిందట. 'సినిమాల విషయానికొస్తే వారంతా ఒకరికొకరు కాంపిటీటివ్​గా కనిపిస్తారు. కానీ, వ్యక్తిత్వంలో వాళ్లు చాలా సింపుల్‌గా ఉంటారు. అది వాళ్ల నుంచి కచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం. మీరు కూడా వినయంగా నడుచుకుంటారని మీకు అనిపిస్తే, ఒకసారి వాళ్లను కలిశాక మీ నిర్ణయం మారిపోతుంది. ఇంకా చాలా నేర్చుకోవాలని తెలుస్తుంది' అని మనసులో మాట బయటపెట్టారు.

వాస్తవానికి ఈ సినిమాలో రజినీకాంత్​తో కలిసి నటిస్తున్నట్లు ఆమెకు ముందుగా తెలియదట. డైరక్టర్ జ్ఞానవేల్ నుంచి కాల్ రాగానే వెంటనే ఒప్పేసుకున్నారట. జ్ఞానవేల్​ దర్శకత్వం వహించిన 'జై భీమ్' బాగా నచ్చేయడం వల్ల వెంటనే ఓకే చెప్పేశారట. ఆ తర్వాత రజినీకాంత్​తో నటించాలని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యారంట. ఇదేం మొదటిసారి కాదట. అజిత్ హీరోగా నటించిన 'తునివు' చిత్రంలోనూ ఇలాగే జరిగిందట. డైరెక్టర్ హెచ్ వినోద్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ప్రాజెక్టు ఓకే చేసేశారట. ఆ తర్వాత అజిత్ హీరో అని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యారట.

కాగా, దర్శకుడు జ్ఞానవేల్ 'జై భీమ్' సినిమా తర్వాత వస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా 'వేట్టయాన్'. ఇందులో రజినీకాంత్‌కు భార్యగా మంజూ వారియర్ నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దసరా విజయన్ కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది.

రజనీకాంత్‌ 'వేట్టాయాన్‌' - హుషారెత్తించేలా ఫస్ట్ సాంగ్ రిలీజ్​ - Vettaiyan Manasilayo Song Released

రజనీకాంత్ జోరు - యంగ్​ డైరెక్టర్​తో మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​! - Rajinikanth New Movie

ABOUT THE AUTHOR

...view details