Rajinikanth Furious On Reporter : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. అసంబద్ధమైన ప్రశ్నలు అడగవద్దంటూ కోరారు. తనను రాజకీయంగా ఎటువంటి ప్రశ్నలకు అడగొద్దని అన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆ ప్రశ్న వల్ల అసహనం
రజనీ ప్రస్తుతం 'కూలీ' సినిమా షెడ్యూల్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా అప్‌కమింగ్ షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ముచ్చటించారు. వారు ఆయన్ను సినిమా అప్డేట్స్తో పాటు పలు ప్రశ్నలు అడిగారు.
ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో 'సమాజంలో మహిళల భద్రత' గురించి ఓ విలేకరి ప్రశ్నించగా, దానికి ఆయన అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని కోరారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగవద్దని స్పందించారు.
ఇదిలా ఉండగా, ఇదే వేదికగా 'కూలీ' మూవీ అప్‌డేట్‌ను కూడా పంచుకున్నారు రజనీ. షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందని తెలిపారు. అయితే జనవరి 13 నుంచి 28 వరకు మరో షెడ్యూల్ జరగనుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకుంటామని అన్నారు.
#Superstar about #Coolie & political questions!#Rajinikanth #Thalaivar #Jailer
— Rajini✰Followers (@RajiniFollowers) January 7, 2025
pic.twitter.com/TLUIY1tELO
ఇక 'కూలీ' విషయానికి వస్తే రజనీకాంత్ 171 చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని 'లియో' ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, నాగార్జున, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇందులో కూలీ నెంబర్ 1421గా, అలాగే దేవా అనే రోల్‌ను రజనీ ప్లే చేస్తుండగా, సైమన్‌గా నాగార్జున మెరవనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు చక్కటి స్వరాలు సమకూరుస్తున్నారు. తాజాగా రజనీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన 'చికిటు వైబ్' పాటకు నెట్టింట మంచి క్రేజ్ లభించింది. అందులో రజనీ స్వాగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
రజనీ కూల్ స్టెప్స్‌తో 'చిటుకు వైబ్' - కూలీ ఫస్ట్ సింగిల్ ప్రోమో చూశారా?
'రజనీతో ఇక ఎప్పటికీ పని చేయరా!?' - కమల్ హాసన్ క్లారిటీ ఇదే!