ETV Bharat / sports

టాప్ 10లోకి పంత్- అగ్రస్థానంలోనే బుమ్రా- ICC ర్యాంకింగ్స్​ - ICC RANKINGS

ICC లేటేస్ట్ ర్యాకింగ్స్- టాప్​ 10లోకి పంత్

ICC Rankings
ICC Rankings (Source : Associates Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 8, 2025, 3:06 PM IST

ICC Rankings 2025 : ఐసీసీ లేటెస్ట్ టెస్ట్ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. 908 రేటింగ్స్​తో బుమ్రా టాప్​లో కొనసాగుతున్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ 841 రేటింగ్స్​తో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రాణించిన ఆసీస్ పేసర్ స్కాట్ బొలాండ్ ఏకంగా 29 స్థానాలు ఎగబాకాడు. అతడు 745 రేటింగ్స్​తో రవీంద్ర జడేజాతో కలిసి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ నుంచి బుమ్రా, జడేజా మాత్రమే టాప్ 10లో కొనసాగుతున్నారు.

టాప్ 5 బౌలర్లు

  • జస్ప్రీత్ బుమ్రా (భారత్) - 908 రేటింగ్స్
  • పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 841 రేటింగ్స్
  • కగిసొ రబాడా (సౌతాఫ్రికా) - 837 రేటింగ్స్
  • జోష్ హేజిల్​వుడ్ (ఆస్ట్రేలియా)- 835 రేటింగ్స్
  • మార్కొ జాన్సన్ (సౌతాఫ్రికా)- 785 రేటింగ్స్

బ్యాటింగ్​లో రిషభ్ పంత్ (739 రేటింగ్స్​) మూడు స్థానాలు మెరుగుపర్చుకుకొని టాప్ 10లోకి దూసుకొచ్చాడు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (847 రేటింగ్స్) నాలుగో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ టెంబా బవూమా (769 రేటింగ్స్)కూడా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 6వ ప్లేస్ దక్కించుకున్నాడు. కాగా, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (895 రేటింగ్స్)తో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలు పడిపోయాయి. రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి (554 రేటింగ్స్) 42వ ప్లేస్​కి పడిపోయాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (614 రేటింగ్స్) మూడు స్థానాలు పడిపోయి, 27వ ప్లేస్​లో కొనసాగుతున్నాడు.

టాప్ 5 బ్యాటర్లు

  • జో రూట్ (ఇంగ్లాండ్)- 895 రేటింగ్స్
  • హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్)- 876 రేటింగ్స్
  • కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 867 రేటింగ్స్
  • యశస్వీ జైస్వాల్ (భారత్)- 847 రేటింగ్స్
  • ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) - 772 రేటింగ్స్

టెస్టు రికార్డ్
భారత్- ఆసీస్ మధ్య రీసెంట్​గా ముగిసిన సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో పంత్ రఫ్పాడించాడు. అతడు టెస్టుల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 29 బంతుల్లోనే 50 మార్క్ అందుకున్నాడు. పంత్ ఆ ఇన్నింగ్స్​లో మొత్తం 33 బంతుల్లో 61 పరుగులు చేశాడు.

గబ్బాలో పంత్ నయా రికార్డు - 150 మార్క్‌ను తాకిన మూడో భారత వికెట్ కీపర్​గా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.