ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలను అమ్ముతున్నారా? మరి ఈ ట్యాక్స్​ గురించి తెలుసా? - IT RULES FOR SELLING JEWELLERY

బంగారు, వెండి, వజ్రాల అభరణాలు అమ్మే సమయంలో విధించే పన్ను గురించి మీకోసం!

IT rules for Selling Gold and Silver
IT rules for Selling Gold and Silver (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : 19 hours ago

IT rules for Selling Gold and Silver : బంగారం, వజ్రాలు, వెండితో చేసిన ఆభరణాలు చరాస్తిగా లెక్కలోకి వస్తాయి. చాలామంది వీటిని పెట్టుబడి మాధ్యమంగా భావిస్తారు. ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు ఆభరణాలను విక్రయిస్తుంటారు. అలాంటప్పుడు సుదీర్ఘ కాలంగా మన దగ్గరున్న ఆభరణాలపై 'దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను' (లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్)‌ను విధిస్తారు. ఆభరణాలను విక్రయించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని పన్ను నియమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

24 నెలలకు ముందు, తర్వాత
చాలామంది వ్యక్తుల వార్షిక ఆదాయాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి వారు ఆభరణాలను విక్రయిస్తే ఏదైనా పన్ను మినహాయింపు లభిస్తుందా? కనీసం అలాంటి వారికైనా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును మినహాయిస్తారా? వారు విక్రయించే ఆభరణాలపై ట్యాక్స్ ఎంత పడుతుంది ? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే ముందు మనమంతా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఆభరణాలు కూడా మూలధన ఆస్తులే. వాటి విక్రయం ద్వారా ఏమాత్రం లాభాన్ని ఆర్జించినా దానిపై పన్నును విధిస్తారు. ఆ పన్ను ఎంత ఉండాలి అనేది ఆభరణాలను కొన్న తర్వాత 24 నెలల్లోగా విక్రయించారా? 24 నెలల తర్వాత విక్రయించారా ? అనే దానిపై ఆధారపడి నిర్ణయమవుతుంది. 24 నెలల తర్వాత విక్రయించే ఆభరణాల వచ్చే లాభాలపై 'దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను'ను విధిస్తారు. 24 నెలల్లోగా విక్రయించే ఆభరణాలపై 'స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను'ను విధిస్తారు. స్వల్పకాలిక మూలధనం అంటే వ్యక్తులు సాధారణంగా నిత్యం ఆర్జించే ఆదాయం లాంటిదే. సాధారణంగా వ్యక్తుల ఆదాయంపై ఎంతైతే పన్నును విధిస్తారో అంతే పన్నును 24 నెలల్లోగా విక్రయించే ఆభరణాలపైనా విధిస్తారు.

పన్ను మినహాయింపు అవకాశాలు
ఈ ఆర్థిక సంవత్సరం లెక్కల విషయానికి వస్తే 2024 జులై 23లోగా ఆభరణాలను ఎవరైనా విక్రయించి ఉంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ఆభరణాలను విక్రయించగా వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలను ఒకవేళ ఇండెక్సేషన్ చేయిస్తే, వాటిపై 20 శాతం పన్ను విధిస్తారు. ఆ వివరాలను ఇండెక్సేషన్ చేయించుకుంటే దీర్ఘకాలిక మూలధన లాభాలపై దాదాపు 12.50 శాతం మేర పన్ను వేస్తారు. వార్షిక ఆదాయం నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నవారు ఇండెక్సేషన్ చేయించకుంటే వారికి ఆభరణాల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను తగ్గిపోతుంది. ఆభరణాల విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై సాధారణంగానైతే రూ.2.50 లక్షల దాకా కనీస పన్ను మినహాయింపును పొందొచ్చు. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్లలోపు వారు రూ.3 లక్షల దాకా, 80 ఏళ్లకు పైబడిన వారు రూ.5 లక్షల దాకా పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మారిపోతే వయసుతో సంబంధం లేకుండా రూ.3 లక్షల దాకా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఈ చిట్కా తెలుసుకోండి
దీర్ఘకాలంగా ఇంట్లో ఉన్న ఆభరణాలను విక్రయించిన సమయంలో ఇంటిని కొనడం లేదా ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం వంటి పనులు చేస్తే ఆభరణాల విక్రయం ద్వారా ఆర్జించిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును చెల్లించకుండా మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.