Nayanthara Chandramukhi Movie : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకు తాము ఎటువంటి నోటీసులు పంపలేదని తాజాగా 'చంద్రముఖి' నిర్మాతలు మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ఆమె నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.
ఏమైందంటే?
నయనతార లైఫ్‌లోని కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్‌ను డాక్యుమెంటరీ రూపంలో చూపించేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది విడుదలైన దగ్గరి నుంచి చాలా కాంట్రవర్సీలు ఎదుర్కొంటోంది. తాజాగా ఇందులో 'చంద్రముఖి'లోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించడం పట్ల ఆ నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే వీటిపై ఆ సినిమా నిర్మాతలు తాజాగా స్పందించారు.
తన డాక్యుమెంటరీ కోసం ముందే నయనతార నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆ సర్టిఫికెట్‌ను మేకర్స్ షేర్ చేశారు. "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'ను రూపొందించేందుకు ముందే 'రౌడీ పిక్చర్స్' సంస్థ మా నుంచి అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుంది. అందుకే డాక్యుమెంటరీలో 'చంద్రముఖి'లోని సీన్స్‌ను ఉపయోగించడంపై మేము ఎటువంటి నోటీసులు పంపలేదు. మాకు దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు' అని 'చంద్రముఖి' నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ పేర్కొంది. అలాగే రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించింది.
Chandramukhi team claiming ₹5⃣ cr compensation from Nayanthara netflix documentary is UNTRUE✖️ pic.twitter.com/FD7VfdCc4X
— Manobala Vijayabalan (@ManobalaV) January 6, 2025
అప్పట్లో ధనుశ్!
అయితే పర్మిషన్ తీసుకోకుండా నయన్ తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. సుమారు మూడు సెకన్ల క్లిప్‌నకు ఆయన రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నయన్, ధనుష్ క్యారెక్టర్‌ను తప్పుబట్టి, తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ ఓ లేఖ రాసుకొచ్చారు. అయితే లీగల్ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సీన్స్ ఉపయోగించడం పట్ల ధనుశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని నయన్ దంపతులతో పాటు నెట్‌ఫ్లిక్స్ టీమ్‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులను సైతం జారీ చేసింది.
'ధనుశ్ నాకు మిత్రుడే - అయినా నేనెందుకు భయపడాలి?' : నయనతార
గుర్తుంచుకో, అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది : కాంట్రవర్సీ వేళ నయన్ పోస్ట్