Mahesh Babu Ram Pothineni Movie Shooting :టాలీవుడ్ హీరోరామ్ పోతినేని ఈ మధ్య సరైన హిట్ పడలేదు. ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ అంటూ వరుసగా డిజాస్టర్లు ఖాతాలో పడుతున్నాయి. చివరిగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ ముందు మరీ దారుణంగా నిరాశ పరిచింది. కలెక్షన్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యాక పూరి ఏంటి మరి ఇంత దారుణంగా, లాజిక్‌లెస్‌గా సినిమా తీశాడంటూ చాలా మంది విమర్శించారు.
అయితే ప్రస్తుతం రామ్ పోతినేని తన తర్వాతి సినిమాను పి. మహేశ్ బాబు దర్శకత్వంలో చేస్తున్నట్లు ఈ మధ్యే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దర్శకుడు మహేశ్ బాబు చివరగా నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడీ ఈయనతోనే ఉస్తాద్ రామ్ తన 22వ సినిమాను చేస్తున్నారు.
Ram Potineni Mythri Movie Makersతాజాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం ఓ ఎమోషనల్ డ్రామా అని టాక్ వినిపిస్తోంది. రామ్ చేయబోయే పాత్ర యూనిక్‌గా, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.