ETV Bharat / state

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన - ఒకే స్కూల్​లో నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు - POCSO CASE ON 4 TEACHERS KAMAREDDY

నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు - విద్యార్థినులతో అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు ఫిర్యాదు

POCSO Case Filed Against 4 Teachers in Navodaya School
POCSO Case Filed Against 4 Teachers in Navodaya School (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 1:41 PM IST

POCSO Case Filed Against 4 Teachers in Navodaya School : నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​లోని జవహర్ నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులు కొంతకాలంగా తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఇటీవల కొందరు విద్యార్థినులు పూర్వ విద్యార్థులు వద్ద వాపోయారు.

వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మొదట పోలీసు కేసు నమోదు చేశారు. ఒక ఉపాధ్యాయుడిని కర్ణాటకకు బదిలీ చేశారు. తరువాత విచారణలో మిగతా ముగ్గురు ఉపాధ్యాయుల వేధింపులు కూడా వెలుగులోకి రావడంతో వారం రోజుల కిందట నలుగురు ఉపాధ్యాయులపైనా పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై శివకుమారం ఆదివారం తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.