ETV Bharat / offbeat

నోరూరించే "బ్రెడ్​ హల్వా బొబ్బట్లు" - ఇలా చేశారంటే ఒకటికి రెండు మడతబెట్టేస్తారు! - HOW TO MAKE BREAD HALWA BOBBATLU

మీకు తీపి పదార్థాలు అంటే ఇష్టమా? - ఓసారి ఇలా 'బ్రెడ్​ హల్వా బొబ్బట్లు' ట్రై చేయండి!

How to Make Bread Halwa Bobbatlu
How to Make Bread Halwa Bobbatlu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 1:25 PM IST

How to Make Bread Halwa Bobbatlu: చాలా మంది ఇష్టంగా తినే స్వీట్ రెసిపీలలో బొబ్బట్లు ఒకటి. వీటినే ప్రాంతాన్ని బట్టి భక్ష్యాలు, ఒబ్బట్టు, పూరన్​పోలీ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది పండగలు, పూజలు, ప్రత్యేక వేడుకల సమయంలో ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే బొబ్బట్లు అనగానే చాలా మందికి శనగపప్పుతో చేసినవి మాత్రమే తెలుసు. కానీ, శనగపప్పుతో మాత్రమే కాకుండా బ్రెడ్​తో కూడా భక్ష్యాలు ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఇవి మామూలు బొబ్బట్ల కంటే చాలా రుచికరంగా ఉంటాయి. మరి, లేట్​ చేయకుండా ఈ స్వీట్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్​ విధానం వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 1 కప్పు
  • బొంబాయి రవ్వ - 2 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు - పావు టీ స్పూన్​
  • పసుపు - చిటికెడు
  • నూనె - 3 టీ స్పూన్​
  • బ్రెడ్​ స్లైస్​లు - 5
  • నెయ్యి - సరిపడా
  • బెల్లం - అర కప్పు
  • నీళ్లు - అర కప్పు
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్​ నూనె వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్​గా కలుపుకుని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఆ పిండి ముద్దపై 2 టీ స్పూన్ల నూనె పోసి మూత పెట్టి పక్కన పెట్టాలి.
  • మిక్సీజార్​లోకి బ్రెడ్​ స్లైస్​లను చిన్నగా కట్​ చేసుకుని వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 3 టేబుల్​ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి. ఆపై కరిగిన నెయ్యిలో గ్రైండ్​ చేసిన బ్రెడ్​ పౌడర్​ వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​లోకి వచ్చేవరకు వేయించుకోవాలి.
  • ఈ లోపు మరోస్టవ్​ మీద గిన్నె పెట్టి అందులోకి బెల్లం తురుము, వాటర్​ పోసుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • కరిగించిన బెల్లం నీటిని జల్లెడ సాయంతో వడకట్టి బాగా ఫ్రై అయిన బ్రెడ్​ పౌడర్​లో వేసి కలపి ఉడికించుకోవాలి.
  • బ్రెడ్​ మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి మరోసారి కలిపి నెయ్యి పైకి తేలి మిశ్రమం పాన్​కు అంటుకోకుండా సెపరేట్​ అయ్యేంతవరకు కలుపుతూ కుక్​ చేసుకోవాలి.
  • మిశ్రమం దగ్గరపడిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి. ఆపై గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న బాల్స్​గా చేసుకుని పక్కన పెట్టాలి.
  • ముందే కలిపిన గోధుమ పిండి ముద్దను మళ్లీ కలిపి మీడియం సైజ్​ ఉండలుగా చేసుకోవాలి.
  • చపాతీ పీట మీద బటర్ పేపర్​ వేసి కొద్దిగా నెయ్యి అప్లై చేయాలి. దాని మీద చపాతీ ఉండను ఉంచి చేతితోనే కొద్దిగా స్ప్రెడ్​ చేయాలి.
  • ఇప్పుడు అందులోకి బ్రెడ్​ హల్వా బాల్​ను ఉంచి పూర్తిగా క్లోజ్​ చేయాలి. ఆపై చేతికి నెయ్యి రాసుకుంటూ వీలైనంత పల్చగా వత్తుకోవాలి.
  • స్టౌపై పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్​ హీట్​ అయిన తర్వాత ఒత్తుకున్న బొబ్బట్టును వేసి నేతితో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
  • ఇలా అన్నింటిని చేసుకుని ఓ డబ్బాలో స్టోర్​ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్​ హల్వా బొబ్బట్లు రెడీ.
  • ఇక వీటిని నెయ్యి, ముద్దపప్పుతో కలిపి తింటుంటే ఆ టేస్ట్​ మరో లెవల్​ ఉంటుంది. నచ్చితే వెంటనే ట్రై చేయండి.

ఈ ఉగాదికి స్పెషల్ బొబ్బట్లు - పైనాపిల్‌తో అదరగొట్టేయండి!

సేమియాతో పాయసం, ఉప్మానే కాదు - ఇలా "బొబ్బట్లు" చేసుకోండి! - రుచి అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.