Vishwak Sen Laila : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్- దర్శకుడు రామ్ నారాయణ్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'లైలా'. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాహు గారపాటి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆ విశేషాలు,
- 'సోను' కంటే 'లైలా' పాత్ర ఎక్కువగా ఉంటుందా?
సాహు గారపాటి : రెండు పాత్రలకు ఒకే ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ హాఫ్ 'సోనూ' ఉంటాడు. సెకండ్ హాఫ్ 'లైలా' పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. 'సోనూ' లైలాగా ఎలా మారాడనేది కథ. తల్లి సెంటిమెంట్ కూడా ఉంటుంది. తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది తెరపై చూడాలి. - ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమానా? లేదంటే యూత్ కోసం తీశారా
సాహు : ప్రత్యేకంగా ఫలానా వాళ్ల కోసం అనేది లేదు. ప్రేక్షకులను నవ్వించడమే మా ధ్యేయం. మేం ఈ విషయంలో విజయం సాధించాం. అది ట్రైలర్ రిలీజైన తర్వాత అర్థమైంది. - 'కోయ్ కోయ్' పాటను ఎందుకు తీసుకున్నారు?
సాహు : కథకు సెట్ అవుతుందని పాటలో యాడ్ చేశాం. అలాగే అది ట్రెండింగ్‌లోనూ ఉంది. ఆ పాట పాడిన వ్యక్తిని సంప్రదించిన తర్వాతే దాన్ని సినిమాలో వాడుకున్నాం. - ట్రైలర్ చూసి చిరంజీవి ఏమన్నారు?
సాహు : చాలా ఎంజాయ్ చేశారు. కొత్తగా ప్రయోగాలు చేస్తుండాలని ప్రోత్సహించారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. - ట్రైలర్ చూస్తే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది? ఆడియెన్స్ అంగీకరిస్తారంటారా?
సాహు : మా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, సోషల్ మీడియాలో వచ్చే అడల్ట్ కంటెంట్‌తో పోలిస్తే ఇందులో చాలా తక్కువగా ఉంటుంది.
కాగా, ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తోంది. హీరో విష్వక్సేన్ 'లైలా', 'సోను' అనే రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. యోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గరపాటి ఈ సినిమాను నిర్మించారు.
'జాగ్రత్తగా ఇంటికెళ్లు, ఒక్కడివే తిరగొద్దు'- విష్వక్‌కు బాలయ్య సూచన