తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జక్కన్న సినిమాలో 8 లుక్స్​ - ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన మహేశ్​! - జక్కన్న సినిమాలో మహేశ్ 8 లుక్స్

Mahesh Babu Rajamouli Movie : రాజమౌళితో చేయబోయే సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు. ఆ వివరాలు.

జక్కన్న సినిమాలో 8 లుక్స్​ - ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన మహేశ్​!
జక్కన్న సినిమాలో 8 లుక్స్​ - ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన మహేశ్​!

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 7:07 AM IST

Mahesh Babu Rajamouli Movie :సూపర్ స్టార్ మహేశ్‌ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందబోయే భారీ బడ్జెట్​ సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మూవీటీమ్ కానీ మహేశ్‌ బాబు కానీ స్పందించట్లేదు. అయితే ఈ చిత్రంలో మునపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపిస్తారని ఇప్పటికే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మహేశ్​ గడ్డం, లాంగ్ హెయిర్ పెంచుతున్నారు. తన శరీరాకృతిపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అందుకు అవసరమైన కసరత్తులు కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో సూపర్ న్యూస్ వచ్చింది. అదేంటంటే మహేశ్‌ లుక్‌కు సంబంధించి స్కెచ్‌లు పూర్తయ్యాయని తెలిసింది. మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్‌ రెడీ చేసిందని అంటున్నారు. అటు స్టోరీకి, మహేశ్‌ ఆహార్యానికి తగ్గట్టుగా ఆ లుక్స్‌లో మహేశ్‌ను టెస్ట్‌ ఫొటో షూట్ చేస్తారట. ఆ తర్వాత ఫైనల్‌ లుక్‌ను ఖరారు చేయనున్నారని సమాచారం అందింది. ఇది తెలుసుకుంటున్న జక్కన్న, సూపర్ స్టార్​ ఫ్యాన్స్​ తెగ సంతోషపడిపోతున్నారు.

రీసెంట్​గా చాలా కాలం తర్వాత జక్కన్న కూడా ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నాను. త్వరలోనే దీని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ ఇంకా ఫిక్స్​ కాలేదు" అని చెప్పుకొచ్చారు. అలానే మహేశ్ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మూవీ గురించి మాట్లాడారు. "రాజమౌళి సర్‌తో చేసే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్​ చాలా బాగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆయనతో జర్నీని మొదలుపెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను" అని చెప్పారు.

ఇకపోతే ఇండియన్‌ సినిమానే చూడని సరికొత్త ప్రపంచాన్ని తన కొడుకు దర్శకధీరుడు ఆవిష్కరించబోతున్నారని ఈ మధ్యే రచయిత విజయేంద్రప్రసాద్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అమెజాన్‌ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ కథ సాగుతోందని, ఇందులో పలువురు ఫారెన్​ యాక్టర్స్​ నటించబోతున్నట్లు తెలిపారు. ఈ మూవీ అత్యంత భారీ టెక్నాలజీతో దాదాపు రూ.1000కోట్ల బడ్జెట్​తో తెరకెక్కబోతుందని గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు మహారాజ్‌(Mahesh Babu Rajamouli Movie title Maharaj) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది.

మహేశ్ నటించిన ఆ రెండు చిత్రాలు నమ్రతకు అస్సలు నచ్చవట!

ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details