Rashmika Mandanna Chhava Trailer Launch Event : బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నటి రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో రూపొందిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా 'ఛావా'. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ముంబయిలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. అయితే అందులో రష్మిక రిటైర్మెంట్ గురించి సరదాగా మాట్లాడారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
"ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా కనిపించే అవకాశం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఒక నటిగా ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను ఎంతో సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ డైరెక్టర్‌తో ఒకసారి చెప్పాను. ఇది అంత గొప్ప పాత్ర. దీని షూటింగ్ సమయంలో ఎన్నో సార్లు ఎమోషనల్ అయ్యాను. ట్రైలర్ చూశాక కూడా అలానే జరిగింది. విక్కీ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ నన్ను అప్రోచ్ అయినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయా. ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించా. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశా. టీమ్ అంతా ఎంతో సహకరించింది. ఇందులోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి" అని రష్మిక చెప్పారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రమే 'ఛావా'. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కనిపించనుంది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. "సింహం లేకుండా ఉండొచ్చు కానీ ఆ సింహానికి పుట్టిన ఛావా ఇంకా బతికే ఉంది మరాఠాలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్నే లేకుండా చేస్తాం" అంటూ సాగే డైలాగ్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
గాయంతోనే ఈవెంట్‌కు రష్మిక
జిమ్‌లో ఇటీవలే గాయపడిన రష్మిక ముంబయిలో జరిగిన ఛావా ట్రైలర్ రిలీజ్‌కు గాయంతోనే వెళ్లింది. వేదికపై నడిచేందుకు ఇబ్బందిపడుతున్న ఆమెకు విక్కీ సాయం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'నిజంగా సారీ, అలా చెప్పినందుకు' - విజయ్, మహేశ్ సినిమాపై రష్మిక కామెంట్స్!
మళ్లీ ట్రెండింగ్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక - ఈ సారి మ్యాటర్ ఏంటంటే?