ETV Bharat / entertainment

'పుష్ప 2' OTT ఆన్​ ది వే - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే? - PUSHPA 2 OTT

'పుష్ప 2' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Pushpa 2 OTT
Pushpa 2 OTT (Source : Film Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 4:01 PM IST

Pushpa 2 OTT : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమా ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్ చేసింది. డిసెంబర్ 5 రిలీజైన ఈ సినిమా అనేక రికార్డులు బద్దలుకొడుతూ వరల్డ్​వైడ్​గా రూ.1800+ కోట్లు వసూళ్లు సాధించింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్​కు థియేటర్లలో ఫుల్ విజిల్స్ పడ్డాయి.

అదే రేంజ్ సంబరాలు ఓటీటీలోనూ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సినిమాలో మంచి రెస్పాన్స్​ వచ్చిన ప్రీ ఇంటర్వెల్, గంగమ్మ జాతర ఫైట్, క్లైమాక్స్ సన్నివేశాలను ఓటీటీలో చూసేందురు ఆత్రుతగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందంటే?

పుష్ప 2 డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. ​ఇక జనవరి 30 లేదా 31 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ సినిమా అయినా విడుదలైన రోజు నుంచి 6- 8 వారాల తర్వాత ఓటీటీలో వచ్చేస్తుంది. అలాగే పుష్ప సినిమా కూడా 56 రోజుల థియేట్రికల్ రన్​ తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని మేకర్స్​ కూడా ఇప్పటికే చెప్పారు.

ఈ లెక్కన 'పుష్ప 2' గురువారానికి 50 రోజుల థియేట్రికల్ రన్​​ పూర్తి చేసుకుంది. ఇక మరో 6 రోజులు, అంటే జనవరి 30 లేదా 31 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్​కు అందుబాటులోకి రావొచ్చు! మేకర్స్ రీసెంట్​గా యాడ్ చేసిన 20నిమిషాల పుటేజ్​తోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై సినిమా మేకర్స్, ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​ నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

కాగా, సినిమా విషయానికొస్తే రష్మిక మంధన్నా హీరోయిన్​గా నటించింది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేశ్, జగపతిబాబు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్, రవి శంకర్ సంయుక్తంగా నిర్మించారు.

'పుష్ప 2' మేకింగ్ వీడియో రిలీజ్- ఆ సీన్ల కోసం అప్పటిదాకా ఆగాల్సిందే!

తగ్గని 'పుష్ప రాజ్' జోరు- తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.