తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​కు కలిసిరాని ఆ సెంటిమెంట్​ - మూడు సార్లు బాక్సాఫీస్ దగ్గర బోల్తా! - mahesh rajamouli movie

కెరీర్​లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్​ మహేశ్ బాబుకు ఆ సెంటిమెంట్ మూవీస్​ కలిసి రాలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అదొక్కటే ఆయనకు మైనస్ అని అంటున్నారు​! ఇంతకీ అదేంటంటే?

మహేశ్​కు కలిసిరాని ఆ సెంటిమెంట్​ - మూడు సార్లు బాక్సాఫీస్ దగ్గర బోల్తా!
మహేశ్​కు కలిసిరాని ఆ సెంటిమెంట్​ - మూడు సార్లు బాక్సాఫీస్ దగ్గర బోల్తా!

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 2:40 PM IST

Mahesh Babu Mother Sentiment Movies : సూపర్ స్టార్ మహేశ్​ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మాయిల కలల రాకుమారుడు ఆయన. 50ఏళ్లకు చేరువ అవుతున్నా ఇప్పటికీ యంగ్​గానే కనిపిస్తూ అందరి మనసులను దోచేస్తున్నారు. తన లుక్స్​తో టాలీవుడ్ ప్రిన్స్​గా ఇమేజ్​ తెచుకున్న ఆయన తన నటన, డ్యాన్స్‌, కామెడీ టైమింగ్‌తో సూపర్ స్టార్‌గా ఎదిగారు. కెరీర్​లో ఎన్నో హిట్స్​, ఫ్లాప్స్​ను చూశారు. అయితే విషయానికొస్తే ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న మహేశ్​కు ఆ సెంటిమెంట్ మూవీస్​ కలిసి రాలేదనే చెప్పాలి.

ఇంతకీ అదేంటంటే మహేశ్​​ ఈ మధ్యే సంక్రాంతికి గుంటురు కారంతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించారు. మహేశ్​ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్​లో వచ్చిన మూడో చిత్రం కావడం వల్ల దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ చిత్రం థియేటర్​కు వచ్చిన తర్వాత ఆడియెన్స్​ను మెప్పించలేకపోయింది. మదర్ సెంటిమెంట్​ కీ పాయింట్​గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద మిక్స్​డ్​ టాక్​ను దక్కించుకుంది.

చిత్రంలో ఈ మదర్ సెంటిమెంట్​ ఎమోషనల్​ను పండించలేకపోయారు. తల్లితో ఎలాంటి సంబంధం లేదని కొడుకు పెట్టే ఒక సంతకం చుట్టూ కథంతా తిరుగుతూ ఆడియెన్స్​ను నిరాశపరిచింది. ముఖ్యంగా త్రివక్రమ్​ రచనలో ఉండే బలం కొరవడిందని బాగా టాక్ వినిపించింది.

అయితే గతంలోనూ మహేశ్ నటించిన మదర్ సెంటిమెంట్ సినిమాలు కాస్త నిరాశపరిచాయి. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో మహేశ్​ బాబు హీరోగా నటించిన నాని చిత్రం కూడా ఇదే రిజల్ట్​ను అందుకుంది. సైన్స్ ఫిక్షన్ అండ్ రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం ఎక్కువగా మదర్​ సెంటిమెంట్ చుట్టే తిరుగుతుంది. ఎనిమిదేళ్ల వయసులో తల్లికి తనంటే ఇష్టం లేదని అనుకుని చనిపోదామనుకున్న ఓ పిల్లవాడు ఓ సైంటిస్ట్ ప్రయోగంతో 28 ఏళ్ల కుర్రాడిలా మారిపోతాడు. ఆ తర్వాత పగలు 8 ఏళ్ల పిల్లవాడిలా రాత్రి 28 ఏళ్ల కుర్రాడిలా మారుతూ చివరికి తన తల్లి ప్రేమను తెలుసుకుంటాడు. అలా మహేశ్ ప్రయోగం చేసిన ఈ చిత్రం కూడా అంతగా ఆకట్టుకోలేదు.

ఇక దర్శకుడు తేజ తెరకెక్కించిన నిజం చిత్రంలో మహేశ్ కథానాయకుడిగా నటించారు. 2003లో వచ్చిన ఈ సినిమా బాగానే ఉన్నప్పటికీ థియేటర్ల వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇందులో తన తండ్రిని చంపినందుకు పగ తీసుకునే కొడుకుగా కనిపిస్తాడు మహేశ్​. తన తల్లితో కలిసి అందరినీ వేటాడి చంపుతుంటాడు. ఇందులో కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుంది. కొడుకుకు తల్లే ట్రైనింగ్ ఇచ్చి మరి పగ తీర్చుకునేలా చేస్తుంది. అంటే ఇవన్నీ చూస్తే మదర్ సెంటిమెంట్ ఉన్న చిత్రాలు మహేశ్​కు​ కలిసి రాలేదనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే మహేశ్​కు కాస్త మదర్ సెంటిమెంట్​ ఉన్న మురారి చిత్రం బాగా హిట్ అయింది.

అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్​ ఇదే - అసలు విషయం బయటపెట్టిన మేకప్​మెన్​

6 వేల సంవత్సరాల కథతో 'కల్కి' - టైటిల్ సీక్రెట్ ఇదే : నాగ్​ అశ్విన్

ABOUT THE AUTHOR

...view details