Kritisanon Crew Movie :2014లో మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో వెండి తెరకు పరిచయమైన కృతి సనన్ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. స్టార్ స్టేటస్ కూడా అందుకుంది. తాజాగా కృతి నటించిన క్రూ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. లేడీ ఓరియెంటెడ్‌గా టబు, కృతి సనన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో టాప్ హీరోలు ఎవరూ లేకపోయినా ఈ చిత్రం వంద కోట్ల మైల్ స్టోన్ దాటింది. ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకపోయినా ప్రేక్షకులను సినిమా కథ పరంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.
ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ - "ఇండస్ట్రీలో ఒకరినొకరు మోహమాటానికి పొగుడుకునే కన్నా అవసరమైనప్పుడు సహకారం అందించడం ముఖ్యం. ఒక సినిమా సక్సెస్ చూసి ఎంతమంది సంతోషపడతారో తెలిసినా ఎంతమంది ఏడుస్తారో మాత్రం తెలీదు. ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి ఏ ఒక్క అంశమో కారణం కాదు. దానికి పూర్తి బాధ్యత సినిమా బృందం తీసుకోవాలి. సంజయ్ లీలా భన్సాలి లాంటి టాప్ డైరెక్టర్ కూడా ఒక మహిళా పాత్రను ప్రధానంగా ఎంచుకుని బడ్జెట్లో రాజీ పడకుండా గంగూబాయి కతియావాడి లాంటి సినిమాను తీసి హిట్ కొట్టారు. హీరో అనే పాత్ర లేకపోయినా సినిమాలు హిట్ అవుతాయని ఇలాంటి సినిమాలు నిరూపిస్తాయి. అయినా సరే మహిళా ప్రాధాన్య చిత్రాలకు బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి. ఒక సినిమాలో పెద్ద హీరో ఉన్నంత మాత్రానా థియేటర్లు నిండిపోవు కదా, ఏ సినిమా సక్సెస్‌కు అయినా కథతో పాటు చాలా అంశాలు కారణం అవుతాయి. లేడి ఒరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు అనే అపోహ ఇండస్ట్రిలో లేకపోతే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. పెద్ద హీరో లేకపోయినా క్రూ సినిమా థియేటర్లలో చాలా బాగా రన్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ నంబర్లు చూస్తుంటే పరిస్థితి మారుతున్నట్టే అనిపిస్తుంది" అని పేర్కొంది.
ప్రస్తుతం కాజోల్ తో దో పత్తి అనే సినిమాలో నటిస్తున్న కృతి ఈ సినిమా షూటింగ్ కోసం తను చాలా కష్టపడ్డానని చెప్పింది. నైనిటాల్, మనాలి, ముస్సోరి లాంటి హిల్ స్టేషన్స్‌తో పాటు దేశమంతా తిరిగామని చెప్పింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కృతి ఈ సినిమాలో నటించడమే కాదు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. త్వరలోనే ఇది విడుదల కానుంది.
'హీరోలకు అంత సీన్ లేదు' : హీరోయిన్ కృతిసనన్ షాకింగ్ కామెంట్స్! - Kritisanon Crew Movie - KRITISANON CREW MOVIE
Kritisanon Crew Movie : హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ కృతిసనన్. పూర్తి వివరాలు స్టోరీలో
'హీరోలకు అంత సీన్ లేదు' : హీరోయిన్ కృతిసనన్ షాకింగ్ కామెంట్స్!
Published : Apr 12, 2024, 12:44 PM IST