ETV Bharat / business

హిండెన్‌బర్గ్‌ సంస్థ మూసివేత- కారణమేంటి? ఫౌండర్ ఏమన్నారు? - HINDENBURG CLOSED

అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఫౌండర్‌ నాథన్‌ మూసివేత!

Hindenburg Closed
Hindenburg Closed (GEtty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 8:20 AM IST

Updated : Jan 16, 2025, 9:08 AM IST

Hindenburg Closed : అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో ఆ మధ్య భారత స్టాక్‌ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్‌ అండర్సన్‌ గురువారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతానని అన్నారు. తన బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతానని అన్నారు.

"ఈ విషయం గురించి గతేడాది చివరి నుంచి నా కుటుంబం, స్నేహితులు, మా బృందంతో చర్చించాను. అనంతరం హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా. దీనిపై మేం ఎంచుకున్న ప్రణాళికలు , ఐడియాలు ముగియడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీని వెనక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవు. విజయవంతమైన కెరీర్‌ ఏదో ఒకరోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని ఒకరు నాకు చెప్పారు. గతంలో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకునేవాడిని. ఇప్పుడు నేను కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నానని అనిపిస్తోంది. హిండెన్‌బర్గ్‌ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. కానీ, జీవితానికి సరిపడా చేసిన సాహసం. ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేశాం. ఇదంతా నాకో ప్రేమకథలా అనిపిస్తోంది"
-- లేఖలో అండర్సన్‌

ఏమిటీ హెండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌?
న్యూయార్క్‌ కేంద్రంగా ఉన్న ఈ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research)ను నాథన్‌ అండర్సన్‌ 2017లో స్థాపించారు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తన వెబ్‌సైట్‌లో ఈ కంపెనీ వెల్లడించింది.పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రీసెర్చి సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తిస్తుంది. ఈ కంపెనీ షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది.

మార్కెట్‌లోని ప్రతి లావాదేవీలో ముందు కొనడం- తర్వాత అమ్మడం లేదా ముందు అమ్మడం - తర్వాత కొనడం జరుగుతాయి. షేర్లను కొని విలువ పెరిగాక విక్రయించి లాభాలు ఆర్జించవచ్చు. ఇక రెండో విధానంలో షేర్లను అధిక ధర వద్ద విక్రయించి తక్కువ ధర వద్ద కొని లావాదేవీని ముగించి లాభాలు ఆర్జించవచ్చు. సంక్షిప్తంగా ఈ రెండో విధానాన్ని షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు.

అదానీపై ఆరోపణలతో!
హిండెన్‌బర్గ్‌ ఏదైనా కంపెనీపై గురిపెడితే తొలుత ఆరు నెలలకు పైగా పబ్లిక్‌ రికార్డులు, అంతర్గత కార్పొరేట్‌ పత్రాలను పరిశీలించి, కంపెనీ ఉద్యోగులతో మాట్లాడి సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసే భాగస్వాములకు వాటిని చేరవేస్తుంది. తర్వాత ఆ బృందం మొత్తం సదరు కంపెనీ షేర్లలో షార్ట్‌ పొజిషన్లు తీసుకొంటాయి. ఆ కంపెనీ విలువ పతనమైన సమయంలో హిండెన్‌బర్గ్‌కు ఆదాయం లభిస్తుంది.

ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేయడం వల్ల ఆ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. అదానీ గ్రూప్‌ తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల చేసింది. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది. వీటిద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.

Last Updated : Jan 16, 2025, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.