Katrina Kaif Pregnant Rumours :అందంతో పాటు అదరగొట్టే నటనతో మంచి పేరు దక్కించుకున్న హీరోయిన్ కత్రినా కైఫ్. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటకీ ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే కత్రిన గర్భవతి అంటూ మళ్లీ ప్రచారం మొదలైంది.
తాజాగా ముంబయి విమానాశ్రయంలో కత్రినా కైఫ్ కనిపించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. సొమవారం రాత్రి ముంబయి ఎయిర్ పోర్టులో ఈ భామ బ్లాక్ డ్రెస్ పై వదులుగా ఉండే బ్లూ డెనిమ్ జాకెట్ వేసుకుని వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కత్రిన చాలా లూసుగా ఉండే జాకెట్ ధరించడం వల్లనో, లేదా నిజంగానే అమ్మ కాబోతున్నారో తెలియదు కానీ, ఆమె పొట్ట కాస్త ఎత్తుగానే కనిపించింది. దీంతో కత్రిన ప్రెగ్నెంట్ అనే వార్తలు నిజమే అంటూ బలంగా నమ్ముతున్నారు అభిమానులు. ఆమె కచ్చితంగా గర్భవతే అంటే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కత్రిన నడుస్తూ వెళుతున్న వీడియో చూసి "ఆమె గర్భవతి" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. "అవును 100% కచ్చితంగా ఆమె గర్భవతే" అని మరొక వ్యక్తి కామెంట్ చేశారు. ఇక మరో యూజర్ ఏకంగా "ప్రస్తుతం ఆమె ఆరో నెలలో ఉన్నట్లు కనిపిస్తుంది" అని రాసుకొచ్చారు. వీటిని నమ్మని వారు "కత్రిన గర్భవతి అని గత 3 ఏళ్లుగా అంటున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కాదు, బరువు పెరిగింది" అంటూ విమర్శించారు. దీని గురించి మరో వ్యక్తి "ఎవరైనా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తే ప్రజలు అది నిజం కాదని రుజువు చేయాలనుకుంటారు. అలాగే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టని సందర్భాల్లో ఆమె గర్భవతే అని ప్రూవ్ చేయాలనుకుంటారు" అంటూ కామెంట్ చేశారు.
కాగా, కత్రిన, విక్కీ కౌశల్‌కు డిసెంబర్,9, 2021న వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది నెలల తర్వాత నుంచే కత్రిన గర్భవతి అంటూ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కత్రిన గతంలో తన భర్త విక్కీతో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించినప్పుడు కూడా ఆమె గర్భవతి అని, లండన్‌లోనే డెలివరీ చేయించుకుని తిరిగి వస్తారని పుకార్లు వినిపించాయి. ప్రెగ్నెన్సీ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకే భర్తతో కలిసి లండన్ వెళ్లారని కూడా అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు కత్రిన మాత్రం ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించలేదు.
'ఈ సారి కత్రినా కైఫ్ పక్కా ప్రెగ్నెంటే!' - వీడియో వైరల్ - Katrina Kaif Pregnant - KATRINA KAIF PREGNANT
Katrina Kaif Pregnant Rumours : బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ ప్రస్తుతం కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఆమె పర్సనల్ లైఫ్‌పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కత్రిన గర్భవతి అంటూ మరోసారి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.
Katrina Kaif (source ANI)
Published : Jun 25, 2024, 1:07 PM IST